close
Choose your channels

‘సైరా’ విషయంలో నయన్ ఎందుకిలా చేసింది!

Thursday, August 22, 2019 • తెలుగు Comments

‘సైరా’ విషయంలో లేడీ సూపర్‌స్టార్  ఎందుకిలా చేసింది!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కి సంబంధించిన స్టార్స్ సైరా చిత్రంలో కనువిందు చేశారు. ముఖ్యంగా.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషణ్ నిహారిక తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోతో పాటు టీజర్‌లో తెలిసింది. చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ముంబైలో ఈ సినిమా టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన విషయం విదితమే. ఈ టీజర్‌ లాంచ్‌కు చిరు, తమన్నా, రవికిషణ్, విజయ్‌ సేతుపతితో పాటు పలువురు పాల్గొన్నారు.

అయితే నయన్ మాత్రం రాలేదు. దీంతో అసలు ఆమె ఎందుకు రానట్లు..? ‘సైరా’ విషయంలోనూ నయన్ ఎందుకిలా చేసింది..? అనే ప్రశ్నలు అందరూ లేవనెత్తుతున్నారు. వాస్తవానికి సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు ఈ లేడీ సూపర్‌స్టార్ చాలా దూరంగా ఉంటుందన్న విషయం విదితమే. అంతేకాదు.. ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన సినిమాలను కూడా ప్రమోట్‌ చేయడానికి కూడా ఇష్టపడరు.. ఇది పలు సందర్భాల్లో మనం అందరం చూసే ఉంటాం. ఆఖరికి ‘సైరా’లో చిరుకు జోడిగా నటించినప్పటికీ ప్రమోషన్స్‌కు మాత్రం ‘చిరంజీవి సినిమా అయితే ఏంటి?’ అనుకున్నదేమో కానీ ఈ ప్రమోషన్స్‌కు రాలేదు.

అయితే టీజ‌ర్‌ లాంచ్ కాబట్టే రాలేకపోయిందని.. కచ్చితంగా మున్ముంథు చిత్రబృందం చేసే ప్రచార కార్యక్రమాల్లో మాత్రం కచ్చితంగా కనిపిస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ రాను అన్నా కూడా దర్శకనిర్మాతలు మాత్రం దగ్గరుండి పట్టుకొస్తారని టాక్. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? లేడీ సూపర్‌స్టార్ ఏ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz