close
Choose your channels

అఖిల ప్రియను ఒంటరిని చేసిన టీడీపీ.. అసలు పట్టించుకోరేం..

Friday, January 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అఖిల ప్రియను ఒంటరిని చేసిన టీడీపీ.. అసలు పట్టించుకోరేం..

హైదరాబాద్‌లో ప్రవీణ్ రావు అన్నదమ్ముల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియతో పాటు ఆమె భర్త, ఆయన కుటుంబం అడ్డంగా ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అఖిల ప్రియ అరెస్టై జైల్లో ఉన్నారు. మొత్తమ్మీద తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు పెను సంచలనానికి దారి తీసింది. కిడ్నాప్ వ్యవహారమంతా సినిమాటిక్ స్టైల్లో జరగడం.. కిడ్నాప్ చేసిన నిందితులెవరో పోలీసులు 24 గంటల్లోపే గుర్తించడం.. ప్రధాన నిందితురాలు అఖిల ప్రియ అరెస్ట్ అవడం.. అన్నీ చకచకా జరిగిపోయాయి.

అయితే ఇంత వ్యవహారం జరుగుతున్నా.. తమ పార్టీకి చెందిన కీలక నేత అరెస్ట్ అయినా టీడీపీ మాత్రం ఈ వ్యవహారంలో మిన్నకుండిపోయింది. కనీసం ఖండించనూ లేదు.. లేదంటే అఖిలప్రియకు మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయనూ లేదు. ఏపీలో ఏం జరిగినా.. తమ పార్టీ నేతల విషయంలో గవర్నమెంట్ ఏ చిన్న వ్యాఖ్య చేసినా మూకుమ్మడిగా ఖండించే టీడీపీ నేతలు.. మరి అఖిల ప్రియ విషయంలో మాత్రం ఎందుకు మిన్నకుండిపోయారనేది అర్థం కాకుండా ఉంది. ప్రస్తుతం అఖిల ప్రియ జైలులో ఉంటే ఆమె సోదరి భూమా మౌనిక మాత్రం ఒంటరి పోరుకు దిగింది.

తమ సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డలో పట్టు నిలుపుకునేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, తమ అనుచరులకు భరోసా ఇస్తున్నారు. కనీసం మౌనికకు కూడా తోడుగా ఉండేందుకు ఏ ఒక్క టీడీపీ నేత కూడా ఆసక్తి చూపడం లేదు. అసలు వీరి విషయాన్ని ప్రస్తావించడానికే టీడీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి.. చింతమనేని ప్రభాకర్‌కి అండగా నిలిచిన పార్టీ.. అఖిలప్రియ ఫ్యామిలీని మాత్రం ఒంటరిగా వదిలేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.