నాయనా చైతన్య ఏమిటి కన్ ఫ్యూజన్..!

  • IndiaGlitz, [Tuesday,August 09 2016]

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మించారు. ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే...చైత‌న్య న‌టిస్తున్న మ‌రో చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.
అయితే...ప్రేమ‌మ్ నిర్మాణ సంస్థ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌గానే...హీరో నాగ చైత‌న్య ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ....ప్రేమ‌మ్ రిలీజ్ డేట్ ఇంకా క‌న్ ఫ‌ర్మ్ కాలేదు. అంతా ఓకే అయ్యాకా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాను అని ప్ర‌క‌టించారు. ఇంత‌లో సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రాన్ని వ‌చ్చే నెల 9న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు డైరెక్ట‌ర్ గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ప్ర‌క‌టించారు. ప్రేమ‌మ్ నిర్మాణ సంస్థ ప్రేమమ్ రిలీజ్ సెప్టెంబ‌ర్ 9 అని, డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ సాహ‌సం శ్వాస‌గా సాగిపో రిలీజ్ సెప్టెంబ‌ర్ 9న అని ఎనౌన్స్ చేసారు. ఒకే డేట్ కి రెండు చిత్రాలు రిలీజ్ అవుతాయా..? లేక వాయిదా వేస్తారా...అస‌లు ఏం జ‌రుగుతుందో అర్ధం కాక తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు ఫ్యాన్స్. నాయ‌నా చైత‌న్యా.... ఏమిటి క‌న్ ఫ్యూజ‌న్..? క్లారిటీ ప్లీజ్..!

More News

చిరు వస్తున్నారని తెలిసే బన్నిరాలేదట..!

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు.ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాలట.

అందుకే...ఆయన పవర్ స్టార్..!

ఆపదలో ఉన్న వాళ్లు ఎవరైనా సరే....ఆయన దృష్టికి వచ్చిన వారందరికీ పవన్ కళ్యాణ్ సహాయం చేసారు చేస్తునే ఉన్నారు.

చైతన్య ప్రేమమ్ ఆడియో & రిలీజ్ డేట్ ఫిక్స్

అక్కినేని నాగ చైతన్య,శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో,కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ప్రేమమ్.

హర్రర్ మూవీ పై క్లారిటీ ఇచ్చిన వెంకీ..

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం బాబు...బంగారం.మారుతి తెరకెక్కించిన బాబు బంగారం చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

నాని నేను లోకల్ రేపే ప్రారంభం..!

భలే భలే మగాడివోయ్,కృష్ణ గాడి వీర ప్రేమ గాథ,జెంటిల్ మన్...