అల్లు అర‌వింద్ ప్లాన్ ఫ‌లిస్తుందా..? ధృవ కి ఆ రికార్డ్ ద‌క్కుతుందా..?

  • IndiaGlitz, [Wednesday,November 30 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ధృవ డిసెంబర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. అయితే...రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఏ సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు యు.ఎస్ లో 1 మిలియ‌న్ మార్క్ ను అందుకోలేదు. దీంతో ఈసారి చ‌ర‌ణ్ ఎలాగైనా స‌రే ధృవ సినిమాతో 1 మిలియ‌న్ మార్క్ ను ట‌చ్ చేయాలి అని అల్లు అర‌వింద్ ప‌క్కా ప్లాన్ రెడీ చేసారు.

ధృవ ప్రీమియ‌ర్ ను యు.ఎస్ లో భారీగా ప్లాన్ చేసారు. ఈ ప్రీమియ‌ర్ కి ధృవ టీమ్ ని యు.ఎస్ తీసుకెళుతున్నారు అల్లు అర‌వింద్. జ‌న‌ర‌ల్ గా ప్రీమియ‌ర్ అనేది హైద‌రాబాద్ లో ప్లాన్ చేస్తారు..టీమ్ అటెండ్ అవుతారు. ఈసారి కొత్త‌గా చ‌ర‌ణ్ కి యు.ఎస్ లో మార్కెట్ పెంచేందుకు అక్క‌డ‌ ప్రీమియ‌ర్ షోస్ ఏర్పాటు చేసారు. మ‌రి...అల్లు అర‌వింద్ ప్రీమియ‌ర్ ప్లాన్ ఫ‌లిస్తుందా..? 1 మిలియ‌న్ రికార్డ్ ధృవ కి ద‌క్కుంతుందా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

బాలయ్య దృష్టిలో

నందమూరి బాలకృష్ణ తన ప్రెస్టిజియస్ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

500 ధియేట‌ర్స్ లో బేతాళుడు

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సంచ‌ల‌నం సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ  సినిమాలతో విభిన్న చిత్రాల హీరోగా  పేరు తెచ్చుకున్న విజయ్ బిచ్చ‌గాడు సినిమాతో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు.

మ‌హేష్ ఇంట్లో మొద‌లైన క్రిస్మ‌స్ సంబ‌రాలు..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్..ఎంత బిజీగా ఉన్నా...ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. స‌మ్మ‌ర్ కి, ఫెస్టివ‌ల్స్ కి టూర్స్ ప్లాన్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటాడు.

వెంకీ మ‌ర‌ద‌లు దొరికింది..!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గురు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న గురు జ‌న‌వ‌రి నెలాఖ‌రున‌ ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ త‌ర్వాత వెంకీ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రంలో న‌టించ‌నున్నారు.

'భేతాళుడు' శాటిలైట్ హక్కులను

నకిలీ, డా.సలీమ్ చిత్రాలతో తెలుగులో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోని బిచ్చగాడు సక్సెస్తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. బిచ్చగాడు 30 కోట్ల కలెక్షన్స్ సాధించడంతో ఇప్పుడు ఆ మార్కెట్ను కంటిన్యూ చేయాలని విజయ్ ఆంటోని ఆలోచిస్తున్నాడు.