close
Choose your channels

బ‌న్నీ 19 విడుద‌ల అప్పుడేనా?

Wednesday, May 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ‌న్నీ 19 విడుద‌ల అప్పుడేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ చివ‌రి వారంలో చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. త్వ‌ర‌లోనే రెండో షెడ్య‌ల్ ప్రారంభం కానుంది.

లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. సాధార‌ణంగా సంక్రాంతి రేసులోకి స్టార్ హీరోలు పోటీ ప‌డ‌తారు. ఇప్ప‌టికే ఈ రేసులో బాల‌య్య పేరు, ర‌జ‌నీకాంత్ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతున్నాయి. ఈ రేసులో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా చేర‌బోతున్న‌ట్లు టాక్‌. మ‌రి దీనిపై యూనిట్ వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఈ చిత్రానికి నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీలన‌లో ఉన్నాయ‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.