బోయపాటితో బన్ని హ్యాట్రిక్ కొడతాడా?

  • IndiaGlitz, [Monday,November 09 2015]

రేసుగుర్రంలా క‌థానాయ‌కుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్‌. ప్ర‌స్తుతం ఈ మెగా వారి క‌థానాయ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో 'స‌రైనోడు' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉంటే.. బ‌న్నికి ఉన్న ఓ ట్రాక్ రికార్డ్ 'స‌రైనోడు'కీ క‌లిసొచ్చే అంశంగా ఉంది. ఇంత‌కీ అదేమిటంటే.. త‌మ ఆర‌వ చిత్రాన్ని బ‌న్ని హీరోగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుల‌కు విజ‌య‌మే వ‌రించింది. 'బ‌న్ని' సినిమాని త‌న ఆర‌వ చిత్రంగా తెర‌కెక్కించిన వి.వి.వినాయ‌క్‌కి.. 'రేసు గుర్రం' ని త‌న ఆర‌వ చిత్రంగా తెర‌కెక్కించిన సురేంద‌ర్ రెడ్డికి స‌క్సెస్ ల‌భించింది.

ఇప్పుడు వీరి శైలిలోనే త‌న ఆర‌వ చిత్రాన్ని బ‌న్నితో తీస్తున్నాడు బోయ‌పాటి. మ‌రి బోయ‌పాటి కాంబినేష‌న్‌తో త‌న‌కున్న ఆ ట్రాక్ రికార్డ్ కి సంబంధించి.. బ‌న్ని హ్యాట్రిక్ కొడ‌తాడో లేదో చూడాలి. విశేష‌మేమిటంటే.. 'బ‌న్ని', 'రేసు గుర్రం' ఏప్రిల్ ప్ర‌థ‌మార్థంలో రిలీజ‌య్యాయి. 'స‌రైనోడు' కూడా ఆ వైపుగానే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

More News

మొన్న మహేష్.. నిన్న చరణ్.. నేడు అఖిల్..

1999లో మహేష్ బాబు ''రాజకుమారుడు''తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..2007లో ''చిరుత''తో రామ్ చరణ్ తెరంగేట్రం చేసినా..

ఈ సంక్రాంతికి లేనట్టే

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు',''ఎవడు'',''గోపాల గోపాల''..ఈ మూడు చిత్రాలకు సంబంధించి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.ఈ మూడు సినిమాలూ మల్టీస్టారర్ సినిమాలు కావడం ఓ కామన్ ఫ్యాక్టర్ అయితే..

'కుమారి' తోనైనా సుకుమార్ ట్రాక్ మారేనా?

నిర్మాణంలో ఉన్న ''నాన్న కు ప్రేమతో''ని కలుపుకుంటే..సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య ఆరు.ఈ అరడజను సినిమాలను విభిన్న శైలిలో రూపొందించే ప్రయత్నమే చేసారు సుకుమార్.

గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ''సతీ తిమ్మమాంబ''భారీ గ్రాఫిక్స్తో ఈనెలాఖరుకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.

'లోఫర్ ' ఫస్ట్ లుక్ విడుదల

''ముకుంద'',''కంచె''వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో