బాలయ్య పాట పాడనున్నారా...?

  • IndiaGlitz, [Monday,July 06 2015]

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ చిత్రం డిక్టేటర్ చిత్రీకరణకి రెడీ అయిపోతున్నాడు. రీసెంట్ గా లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందనుంది. శ్రీవాస్ ఈ చిత్రానికి డైరెక్షన్ తో పాటు ప్రొడక్షన్ లో కూడా పార్ట్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యను రిచ్ గా, స్టయిలిష్ గా చూపించబోతున్నారట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య పాట పాడనున్నాడని వార్తలు వినపడ్డప్పటికీ ఆ విషయంలో తాము ఇంకా అసలేం అనుకోలేదని, దీనిపై వస్తున్న వార్తలన్నీ నిజంకాదని చిత్రయూనిట్ తెలియజేసింది. అయితే ఇప్పటి వరకు థమన్ తాను కంపోజ్ చేసిన చిత్రాల్లో రామ్ చరణ్ మినహా మిగిలిన అందరీ హీరోలతో పాట పాడించాడు. మరి బాలయ్యచేత తమన్ పాట పాడిస్తాడా? అని ఎదురుచూడాల్సిందే.

More News

నయనకి తేదీ కుదిరింది...

హరర్ సినిమాల్లో నటించడం నయనతారకు ఇంతకు ముందు అలవాటు లేదు.

బాహుబలి లాంటి చిత్రం జీవితంలో ఒక్కసారే: ప్రభాస్

‘బాహుబలి’...టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు టోటల్ ఇండియా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది.

నందమూరి కళ్యాణ్ రామ్ 'షేర్' షూటింగ్ పూర్తి

డైనమిక్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సాయి నిహారిక, శరత్ చంద్ సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘షేర్’.

జూలై మూడోవారంలో 'వినోదం 100%' ఆడియో విడుదల

ఎస్.ఎస్. సెల్యులాయిడ్స్ పతాకంపై శ్రీరామ్మూర్తి దర్శకత్వంలో విజయ్ భరత్, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్లుగా పొట్నూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘వినోదం 100%’.

అక్కినేని హీరోతో మాంత్రికుడు...

‘ఒక లైలా కోసం’ చిత్రం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బిజీగా ఉంటూనే కొత్త కథలను వింటున్నాడు.