షర్మిల ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెబుతారా!?

  • IndiaGlitz, [Monday,March 25 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం ఉదయం ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. జరగబోయే ఎన్నికలు మిగతా అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్టానికి చాలా కీలకమన్నారు. వైఎస్సార్ కుమార్తెగానే కాకుండా, ఒక సామాన్య పౌరురాలిగా మీ ముందు కొన్ని విషయాలు మాట్లాడాలన్నారు. భూతద్దం పెట్టుకుని వెతికిన ఏపీలో అభివృద్ధి కనబడుతుందా..ఎన్ని పరిశ్రమలు వచ్చాయి. ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. రైతు బాగుపడుతున్నాడా? పేదవారు సంతోషంగా ఉన్నారా? పేద విద్యార్థులకు భరోసా ఉందా.? వైయస్‌ఆర్‌ హయాంలో కళకళలాడిన రాష్ట్రమేనా ఇది అని ఆలోచన చేస్తే చాలా బాధేస్తుంది. వైఎస్‌ఆర్‌ హయాంలో పేద కుటుంబాలు సంతోషంగా ఉండేవి. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేంది. గిట్టుబాటు ధర ఉండేది. ప్రతి వ్యక్తికి ఉపాధి ఉండేది. పేదవారు గొప్ప చదువులు ఉచితంగా చదువుకునే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది. పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ ఉండేది. ప్రతి మహిళలకు భరోసా ఉండేది. కుల,మత పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి వైఎస్ మేలు చేశారు. చంద్రబాబు హయాంలో ఎలా ఉంది.. ? గొప్పలు చెప్పుకోవడమే తప్ప చంద్రబాబు హయాంలో పాతికేళ్లు వెనక్కు నెట్టబడింది. మొదటి ఐదు సంతకాలు అని, చంద్రబాబు చెప్పారు. కనీసం మొదటి సంతకానికైనా విలువ నిచ్చారా..అధికారంలోకి రావడానికి మొత్తం రుణమాఫీ అని వాగ్ధానం చేసి.. ఎన్నికలు అయిన తర్వాత ఆ రుణమాఫీపై సంతకంపై పెట్టకుండా..కమిటీని వేస్తున్నానని సంతకం పెట్టారు. ఆ రోజు మొత్తం రుణం 87 వేల కోట్ల రూపాయలు. కోటయ్య కమిటీ సాకులు చూపి 24వేల కోట్లకు కుదించింది అని షర్మిల చెప్పుకొచ్చారు.

భిక్షం ఇచ్చినట్లుగా..

చంద్రబాబు నేటివరుకూ పూర్తిగా చెల్లించలేదు. కేవలం అధికారం కోసం అబద్ధాపు వాగ్ధానాలు ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశారు. ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో రుణమాఫీ చేయలేదని ప్రకటించలేదా..? చేసే ఉద్దేశం కూడా లేదన్నారు. ఆ రోజు మహిళలకు ఉన్న మొత్తం రుణం 14వేల కోట్ల రూపాయలు. నేటికి 25వేల కోట్ల రూపాయలు అయ్యింది. కేవలం ఆరువేల కోట్లతో బిక్షం ఇచ్చినట్లు పసుపు–కుంకమ పేరుచెప్పి మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 14వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టు అంచనాను 60వేల కోట్లకు పెంచారు. కమీషన్లు ద్వారా లాభపడాలని నామినేషన్‌ పద్దతిలో వారికి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టును లాగేసుకోలేదా...? పోలవరం మూడేళ్లలో పూర్తిచేస్తానని చంద్రబాబు వాగ్ధానం చేయలేదా...? అమరావతిలో 4వేల ఎకరాలు, ఎకరం మూడు, నాలుగు కోట్ల విలువ చేసే భూమిని కేవలం 50 లక్షలకు తన బినామీలకు అమ్మేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టలేదా...? రాజామౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్‌ చూపించారు. మనవాళ్లు సరిపోరని సింగపూర్‌ నుంచి ప్లానర్స్‌ను రప్పించారు. త్రిడి మోడళ్లను చూపించారు తప్ప ఒక శాశ్వత భవనమైనా కట్టించారా...? అమరావతిని అనాధను చేస్తూ ఒక శాశ్వత భవనం కట్టలేదు కాని, చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఉన్న పర్మినెంట్‌ భవనం కోసం ప్రజల డబ్బును ఖర్చుపెట్టలేదా...? ప్రజల సోమ్మును దుర్వినియోగం చేయలేదా...? పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకోక పోతే పేదరికం నుంచి బయటపడలేరని వైఎస్సార్ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారని.. కాని చంద్రబాబు మాత్రం మేము అంతా ఇవ్వం. కొంచెం ఇస్తామని చెప్పి చివరుకు అది కూడా ఇవ్వకపోతే.. తన తల్లిదండ్రులు అప్పులపాలు అయిపోతున్నారని ఎంతోమంది విద్యార్థులు చదువులు మానేశారు. చంద్రబాబు ఆయన చేతితో విద్యార్థుల భవిష్యత్‌ ఖూనీ చేశారన్నారు. పేదవారు గొప్పవాడిలా కార్పొరేట్‌ ఆసుప్రతికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని వైఎస్ఆర్‌ ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే.. చంద్రబాబు ఆరోగ్యశ్రీ లిస్ట్‌ నుంచి ఎన్నో కార్పొరేట్‌ ఆసుపత్రులను తొలగించి..పేదవారు గవర్నమెంట్‌ ఆసుప్రతికి మాత్రమే వెళ్ళాలని చంద్రబాబు శాసించలేదా..ఇది అమానుషం కాదా..? చంద్రబాబు,వారి కుటుంబాలకు జబ్బులొస్తే గవర్నమెంట్‌ ఆసుప్రతికి వెళ్తారా..మంచి వైద్యం అందక పేదవాళ్లు చనిపోతే ఆ పాపం చంద్రబాబుది కాదా..? అని చంద్రబాబుపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే షర్మిల ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానం వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.

More News

మహేశ్ మైనపు విగ్రహం ఆవిష్కరణ.. ఫ్యాన్స్ కన్ఫూజన్

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మహేష్‌కు ఉన్న క్రేజ్‌ను గుర్తించిన ప్రముఖ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం నిర్వాహకులు

'చిత్ర‌ల‌హ‌రి' ..'గ్లాస్‌మేట్స్...' పాట విడుద‌ల‌

సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా 'నేను శైల‌జ' ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌ నిర్మిస్తోన్న చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'.

నాగార్జున  'మ‌న్మ‌థుడు 2' ప్రారంభం

'మ‌న్మ‌థుడు' సినిమాను ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న  మ‌రో  ఎంట‌ర్‌టైన‌ర్ 'మ‌న్మ‌థుడు 2'.

విజయసాయి రెడ్డి నోరు అదుపులో పెట్టుకో!

వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా పవన్‌, సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విజయసాయి విమర్శలు

పులివెందుల‌లో సొంత చిన్నాన్న‌ను చంపితేనే..!

"తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప‌ట్టించుకోలేదు. అధికార పార్టీ నాయ‌కుల‌ను చ‌ట్ట‌స‌భ‌ల్లో నిల‌దీయాల్సిన‌ ప్ర‌తిప‌క్ష‌నేత అసెంబ్లీకి వెళ్లరు. ఎంత‌సేపు పాద‌యాత్ర‌లు