ఛార్మి తొలి ప్రయత్నం ఫలించేనా?

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

అందాల న‌టి ఛార్మి ప‌ద‌మూడేళ్ల‌కు పైగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. కేవ‌లం క‌థానాయిక‌గానే కాకుండా వీలైతే ఐటం సాంగ్స్‌తోనూ ఆక‌ట్టుకునే ప్ర‌యత్నం చేసింది ఛార్మి. ఆ ప్ర‌య‌త్నంలో ఆమె చేసిన ప్ర‌త్యేక గీతాలు చాలా వ‌ర‌కు క్లిక్ అయ్యాయి. 'భ‌లేదొంగ‌లు' తో మొద‌లుపెట్టిన ఈ ట్రెండ్‌ని.. 'మ‌హాత్మ‌, ర‌గ‌డ‌, ఢ‌మ‌రుకం, నాయ‌క్' .. ఇలా కొన‌సాగిస్తూనే ఉంది. హిందీలో సైతం 'రా..రాజ్‌కుమార్'లో ఈ త‌ర‌హా గీతం చేసింది.

ఇక ఇప్పుడు త‌మిళంలో తొలిసారిగా ఓ సినిమా కోసం ఐటం గాళ్ అవ‌తార‌మెత్తింది ఛార్మి. విక్ర‌మ్‌, స‌మంత జంట‌గా రూపొందిన త‌మిళ చిత్రం '10 ఎండ్ర‌త్తుకుల్ల' కోసం ఛార్మి చేసిన ప్ర‌త్యేక గీతం 'గాన‌..గాన‌..' కు సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఇందులో ఛార్మి గ్లామ‌ర్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఉంది. మ‌రి.. తొలిగా చేస్తున్న ఈ ప్ర‌త్యేక గీతం ఛార్మికి త‌మిళంలో మ‌రిన్ని గీతాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తుందేమో చూడాలి.

More News

ఎన్టీఆర్ వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో..సినిమా చేస్తున్నారు.

విజయ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ పులి : శోభారాణి

ఇలయదళపతి విజయ్‌ హీరోగా అతిలోక సుందరి శ్రీదేవి కీలకపాత్రలో, శ్రుతిహాసన్‌, హన్సిక కథానాయికలుగా చింబుదేవన్‌ దర్శకత్వంలో శిబుతమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మించిన పులి చిత్రం తెలుగు, తమిళ్‌లో రిలీజై ఘనవిజయం సాధించింది.

సుప్రీమ్ లో సుప్రీమ్ సాంగ్..?

మెగా స్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన రేయ్ సినిమాలో చిరంజీవి గోలిమార్ సాంగ్ రీమిక్స్ చేసిన విష‌యం తెలిసిందే.

చ‌ర‌ణ్ గురించి చిరు టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాల్లో స‌క్సెస్ అవుతాడా..? లేదా అని చిరంజీవి తెగ టెన్ష‌న్ ప‌డేవార‌ట‌.

షేర్ ఆడియో రెడీ

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సోనాల్ చౌహ‌న్ న‌టించారు.