మ‌రి దేవిశ్రీ స‌పోర్ట్ ఇస్తాడా?

  • IndiaGlitz, [Friday,September 22 2017]

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌కి తొలి అవ‌కాశ‌మిచ్చి ప్రొత్స‌హించిన ఘ‌న‌త నిర్మాత ఎం.ఎస్‌.రాజుది. ఆయ‌న నిర్మించిన దేవి చిత్రం ద్వారా చిన్న వ‌య‌సులోనే సంగీత ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌య్యాడు దేవిశ్రీ‌. ఆ సినిమా హిట్ అవ‌డంతో.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆనందం చిత్రం బ్రేక్ ఇచ్చినా.. దేవిశ్రీ హ‌వా స్టార్ట్ అయ్యింది మాత్రం వ‌ర్షం సినిమాతోనే. ఈ సినిమా నిర్మాత కూడా ఎమ్మెస్ రాజునే.

ఆ త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నువ్వొస్తానంటే నేనొద్దాంటానా మ‌రో మ్యూజిక‌ల్ హిట్‌. అంటే.. దేవిశ్రీ కెరీర్ ఆరంభంలో ఎమ్మెస్ రాజు ప్రోత్సాహం చాలానే ఉంద‌న్న‌మాట‌. అలాంటి ఎమ్మెస్ రాజుకి త‌న‌యుడు అయిన సుమంత్ అశ్విన్ హీరోగా ప‌రిచ‌య‌మైతే.. విశేషంగా ఇప్ప‌టివ‌ర‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించ‌లేదు.

అయితే ఆ అవ‌కాశం హ్యాపీ వెడ్డింగ్ రూపంలో వ‌ర్క‌వుట్ అయ్యింది ఇప్పుడు. మ‌రి దేవిశ్రీ ప్ర‌సాద్‌కి ఎమ్మెస్ రాజు బ్రేక్ ఇస్తే.. ఇప్పుడు రాజు త‌న‌యుడు సుమంత్‌ కొత్త సినిమాకి దేవిశ్రీ త‌న మ్యూజిక్‌తో బ‌ల‌మైన‌ స‌పోర్ట్ ఇస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

కొత్త ద‌ర్శ‌కుడు లక్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్‌, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హ్యాపీ వెడ్డింగ్‌ చిత్రంలో నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. వ‌చ్చే నెల 4న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

More News

గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌' రిలీజ్ డేట్‌

మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.

సాగర్ దర్శకత్వంలో నితీష్ రెడ్డి హీరోగా 'ప్రభాస్ ' చిత్రం ప్రారంభం.

నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న"ప్రభాస్"

'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీజర్ విడుదల

గుడ్ అంటే మంచి,బ్యాడ్ అంటే చెడు,అగ్లీ అంటే తింగరితనం అనే పదాలు మనకు తెలిసిందే.

'అదిరింది'.. క‌మ‌ల్ సినిమానా?

విజ‌య్ మూడు పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం మెర్స‌ల్‌.. తెలుగులో అదిరింది పేరుతో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యా మీన‌న్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఎంత పని చేశావ్ సమంత...

చెన్నై సొగసరి సమంత మంచి నటి అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.