close
Choose your channels

ఇక ఎప్పటికీ ఆ ‘హీరో’తో దిల్‌రాజు సినిమా చేయరా!?

Wednesday, August 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇక ఎప్పటికీ ఆ ‘హీరో’తో దిల్‌రాజు సినిమా చేయరా!?

ఎస్ మీరు వింటున్నది నిజమే.. ఇక ఎప్పటికీ ఆ హీరోతో సినిమా తీయకూడదని సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఫిక్స్ అయిపోయారని సమాచారం. ఇందుకు కారణం ఒకే ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ కావడమేనని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరు..? అట్టర్ ప్లాప్ అయిన సినిమా ఏది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ. అయితే విజయ్ మంచి ఊపు మీద ఉండటంతో కొందరు టాప్ నిర్మాతలు.. ఆయనతో సినిమా కోసం క్యూ కట్టారు. వారిలో దిల్‌రాజు కూడా ఒకరు. వరుస చిత్రాలన్నీ హిట్టవ్వడం.. ఇక ‘డియర్ కామ్రేడ్‌’తో విజయ్ చతికిపడటంతో ఎందుకో అనుమానం వచ్చిన దిల్‌రాజు ఇక ఆయనతో సినిమా చేయకూడదని ఫిక్స్ అయిపోయారట. మరోవైపు ‘మైత్రి మూవీస్’ వారు విజయ్‌కి దూరం జరగరాని టాక్. అదే డియర్ కామ్రేడ్ హిట్ అయ్యింటే విజయ్ రేంజ్‌ను ఇక అందుకోలేరేమో మరి. అయితే అటు దిల్, ఇటు మైత్రీ మూవీ మేకర్స్ ఇద్దరూ బ్రేకులేయడంతో చేసేదేమీ లేక డ్యాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

వాస్తవానికి క్రాంతి మాధవత్‌తో చేస్తున్న సినిమాలు తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని దిల్ రాజు భావించారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన కథ కూడా వినిపించేయడం.. వరుస హిట్లతో ఉన్నాడు గనుక మనకేమీ లోటు ఉండదని దిల్ భావించాడట. అయితే డియర్ కామ్రేడ్‌తో సీన్ రివర్స్ కావడంతో పూర్తిగా ప్లేట్ మార్చేశారు.. దిల్, విజయ్. అయితే ఒకానొక సందర్భంలో విజయ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయినప్పటికీ హీరోగారు పట్టించుకోవడం.. దిల్‌రాజును లైట్ తీసుకోవడంతో ఇక ముందు కాదు కదా.. భవిష్యత్తులో విజయ్‌తో సినిమా చేయకూడదని నిర్మాత ఫిక్స్ అయిపోయారని టాక్. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే దిల్‌రాజు కానీ విజయ్ కానీ పెదవి విప్పాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.