నాలుగోవారం కూడా కొన‌సాగేనా?

  • IndiaGlitz, [Wednesday,February 14 2018]

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ పెద్ద‌గా అచ్చి రాక‌పోయినా.. జ‌న‌వ‌రి చివ‌రి వారం నుంచి బాగానే క‌లిసొస్తోంది. మ‌రీ ముఖ్యంగా.. వారానికో సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుండ‌డం విశేషం. జ‌న‌వ‌రి 26న అనుష్క న‌టించిన భాగ‌మ‌తి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

ఆ త‌రువాతి వారంలో.. ఫిబ్ర‌వ‌రి 2న రిలీజైన నాగశౌర్య‌, ర‌ష్మిక మంద‌న్నా చిత్రం ఛ‌లో సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక ఫిబ్ర‌వ‌రి 10న వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలిప్రేమ కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. అంటే..వారానికో హిట్ సినిమా గ‌త మూడు వారాలుగా కొన‌సాగుతోంద‌న్న‌మాట‌.

ఈ నేప‌థ్యంలో.. ఈ వారంలో విడుద‌ల కాబోతున్న ఐదు చిత్రాల్లో ఏ సినిమా హిట్ లిస్ట్‌లో చేరుతుందో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. బుధ‌వారం త‌రుణ్ న‌టించిన ఇది నా ల‌వ్ స్టోరీ రిలీజ్ కానుండ‌గా.. 16న నాని నిర్మించిన అ!, సందీప్ కిష‌న్ మ‌న‌సుకు న‌చ్చిందితో పాటు ర‌చ‌యిత‌, సోడ గోలీసోడ విడుద‌ల కానున్నాయి. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద ఏ సినిమా విజ‌యం సాధిస్తుందో చూడాలి.