ఆ ఇద్ద‌రితో మొద‌టిసారి.. క‌లిసొచ్చేనా?

  • IndiaGlitz, [Wednesday,May 18 2016]

'అష్టాచెమ్మా' వంటి హిట్ చిత్రం త‌రువాత క‌థానాయ‌కుడు నాని, ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ కాంబినేష‌న్‌లో 'జెంటిల్ మ్యాన్' పేరుతో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడున్న‌రేళ్ల గ్యాప్ త‌రువాత వీరి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం ఇది. సుర‌భి, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. నాని పాత్ర హీరోనా? విల‌నా? అంటూ ఆస‌క్తి రేపుతూ ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌, పోస్ట‌ర్ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. జూన్‌లో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు నానితో గాని, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో గాని మ‌ణిశ‌ర్మ క‌లిసి ప‌నిచేసింది లేదు. తొలిసారిగా వారి కాంబినేష‌న్‌లో చేస్తున్న మ‌ణి.. ఈ సినిమా కోసం మంచి మెలోడీయ‌స్ పాట‌ల‌ను అందించాడ‌ని యూనిట్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో స‌రైన హిట్ లేని మ‌ణిశ‌ర్మ‌కి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకువ‌స్తుందో చూడాలి.

More News

స్టార్ హీరో ప‌క్క‌న అంటే అంతేనా..

తెలుగు సినిమాల విష‌యంలో కెరీర్ ని ప్రారంభించిన మూడేళ్ల‌కుగానీ తొలి హిట్‌ని అందుకోలేక‌పోయింది బెంగుళూరు బ్యూటీ ప్ర‌ణీత. 'ఏం పిల్లో ఏం పిల్ల‌డో' తో మొద‌లైన ఈ అమ్మ‌డి టాలీవుడ్ జ‌ర్నీ.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'అత్తారింటికి దారేది'తో స్పీడ్ అందుకుంది.

చీప్ అల్లు పాలిటిక్స్ అంటున్న మ‌హేష్ ఫ్యాన్స్..

అల్లు అర్జున్ స‌రైనోడు స‌క్సెస్ మీట్ లో ప‌వ‌న్ గురించి చెప్ప‌ను అంటూ చెప్పిన చెప్ప‌ను బ్ర‌ద‌ర్...వివాదం రోజురోజుకు మ‌రింత ముదురుతుంది.

యాంక‌ర్ ప్ర‌దీప్ పై పంచ్ వేసిన ప్రిన్స్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్ర‌మోష‌న్స్ అద‌ర‌గొట్టేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మ‌హేష్ యాంక‌ర్ ప్ర‌దీప్ నిర్వ‌హిస్తున్న కొంచెం ట‌చ్ లో ఉంటే చెబుతాను షోలో పాల్గొన్నారు.

బ్ర‌హ్మోత్స‌వం ర‌న్ టైమ్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. బంధాలు - అనుబంధాల ప్రాముఖ్య‌త‌ను నేటి త‌రానికి తెలియ‌చేసే విభిన్న‌ క‌థాంశంతో బ్ర‌హ్మోత్సవం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

ఎన్టీఆర్ కి షాకిచ్చిన సినిమా..

ఏక్టింగ్,డ్యాన్స్,ఫైట్స్ ల్లో అద్భుత అభినయం కనబరిచి మాస్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటీవల ఓ సినిమా షాకిచ్చిందట.