ఆధారాలు చూపిస్తే జగన్ రాజీనామా చేస్తారా!?

  • IndiaGlitz, [Thursday,July 11 2019]

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు-ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిల మధ్య మాటలు తీవ్ర స్థాయికి చేరి.. అది కాస్త సవాల్ దాకా చేరింది. సున్నా వడ్డీకే రుణాలపై ఏపీ అసెంబ్లీలో  చర్చ జరిగింది. గత ప్రభుత్వం సున్నా వడ్డీ పథకంపై రూపాయి కూడా ఇవ్వలేదని.. రికార్డులు కూడా తెప్పిస్తామని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా..? అని జగన్ సవాల్ విసిరారు.

జగన్ వాస్తవాలు తెలుసుకో!

ఈ సవాల్‌కు చంద్రబాబు అంతే రీతిలో స్పందిస్తూ.. అసెంబ్లీ వాయిదా పడినటంతో ప్రెస్‌మీట్ పెట్టారు. జగన్ సవాల్‌కు ప్రతిపక్ష నేత కౌంటరిచ్చారు. అసెంబ్లీలో అధికారపక్షం తీరు సరిగా లేదు. ముఖ్యమంత్రి జగన్‌ అబద్దాలు చెబుతూ.. మాకు సవాల్‌ విసురుతున్నారు. సున్నా వడ్డీకే రుణాల విషయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో.. 2014-15లో ఈ పథకానికి రూ.230 కోట్లు, 2016-17లో రూ.175 కోట్లు, 2017-18 రూ.175 కోట్లు, 2018-19లో రూ.175 కోట్లు కేటాయించాం.

రైతులకు సున్నా వడ్డీ పథకం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చిందని.. తామూ కొనసాగించాం. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు పూర్తిగా మాఫీ అని చెప్పామన్నారు బాబు. వడ్డీ రాయితీ అసలు ఇవ్వలేదని జగన్ చెబుతున్నారని.. సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేశామన్నారు. కరువు మండలాలు ప్రకటిస్తే రుణాల రీ షెడ్యూల్ అవుతాయని.. జగన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. అన్ని ఆధారాలు చూపిస్తా జగన్ రాజీనామా చేస్తారా అని జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు.

సమాధానం చెప్పలేక వాయిదా!

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సున్నా వడ్డీకే రుణాల విషయంలో నాకు జగన్ సవాల్ విసిరారు.. నేను సమాధానం చెప్పాలనుకునేలోపు సభను వాయిదా వేశారు. మేం రికార్డులు తెప్పించుకునే లోపే ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీని వాయిదా వేశారు. అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి పారిపోయారు. అసెంబ్లీలో వైసీపీ దౌర్జన్యం కనిపిస్తోందని.. కరువుపై చర్చ వదిలేసి తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాట్లాడిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

అది నా దుర‌దృష్టం: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

`స్వామిరారా`, `కొత్త‌జంట‌, `బాబు బంగారం`, `దోచెయ్‌` సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను అందించిన సినిమాటోగ్రాఫ‌ర్ రిచ‌ర్డ్ ప్రసాద్‌. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ అందించిన చిత్రం

ఉండిపోరాదే సాంగ్ రిలీజ్ చేసిన డైరెక్టర్ వి వి వినాయక్

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో

'ఎవ‌రు' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`.

ట్రెండింగ్ లో నభా నటేష్

"నన్ను దొచుకుందువటే" తో తెలుగు ఆడియన్స్ ని తన యాక్టింగ్ టాలెంట్ తో ఫిదా చేసిన నభా ఇస్మార్ట్ కి లైన్ మార్చి పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయింది.

పూర్తీ ఫాంటసీ కామెడీ చిత్రంలో హీరోయిన్  అంజలి

ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అటు కమర్షియల్ సినిమాలు ఇటు హారర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని తన నటనతో ఎంటర్టైన్ చేసిన అందాల తార అంజలి.