close
Choose your channels

జగన్ విజ్ఞప్తిని కేసీఆర్ అంగీకరిస్తారా..?

Sunday, January 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఫెడరల్‌‌ ఫ్రంట్‌‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌‌తో టీఆర్ఎస్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే కేసీఆర్-వైఎస్ జగన్‌ను కలవబోతున్నారని టాక్ నడుస్తోంది. అయితే తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌‌ల మధ్య సమస్యలన్నింటీకి కేసీఆర్‌‌తో చర్చించి పరిష్కారాల మార్గాలని చూపాలని జగన్ కోరుతున్నారు.

ఈ సందర్భంగా.."అంతర్‌ రాష్ట్ర ఉద్యోగుల బదిలీకి సంబంధించిన బదిలీలను సత్వరమే పూర్తి చేయాలి. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలి. ముఖ్యంగా పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని.. అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాల" అని కేసీఆర్‌‌కు జగన్ ఓ లేఖ రాశారు.

అయితే ఈ లేఖ కేసీఆర్‌‌కు చేరుకొని గంటలు గడుస్తున్నా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అసలు జగన్‌‌ విజ్ఞప్తిని కేసీఆర్ ఏ మాత్రం లెక్కజేస్తారు..? ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్‌‌లో ఉన్న ఈ బదిలీల వ్యవహారాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే పొత్తు పొడిచే ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని జగన్ సిద్ధమైన తరుణంలో కేసీఆర్ ఆయన డిమాండ్‌‌ను ఏ మాత్రం అంగీకరిస్తారో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఉద్యోగులు ఎప్పట్నుంచో బదిలీలు కావాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయినప్పకీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా కేసీఆర్‌‌ ఏ మాత్రం ఫైళ్లు కదిలించలేదు. ఒక వేళ జగన్ విజ్ఞప్తిని కాదనకుండా కేసీఆర్ ఓకే చెప్పేస్తే.. నిజంగానే జగన్ మొదటి విజయమనే చెప్పుకోవచ్చు.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.