లావణ్య ఎదరుచూపులు పలిస్తాయా?

  • IndiaGlitz, [Monday,August 21 2017]

అందాల రాక్ష‌సి చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి తర్వాత మ‌నం సినిమాలో చిన్న గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చింది. అయితే భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాల‌తో రెండు వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న లావ‌ణ్య త్రిపాఠికి ఆ త‌రువాత వ‌చ్చిన ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది ఫ‌లితం నిరాశ‌నే మిగిల్చింది. అయితే త‌రువాతి చిత్రంగా వ‌చ్చిన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు పాజిటివ్ రిజ‌ల్ట్‌ని ఇచ్చి మ‌రోసారి లావ‌ణ్య‌ది గోల్డెన్ లెగ్గే అని నిరూపించింది.

అయితే ఆ త‌రువాత వెంట వెంట‌నే ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి లావ‌ణ్య‌ని. ఈ ఏడాది ప్రథ‌మార్థంలో వ‌చ్చిన ఆ చిత్రాలే మిస్ట‌ర్, రాధ‌. ఈ రెండు అప‌జ‌యాల త‌రువాత వ‌స్తున్న యుద్ధం శ‌ర‌ణం కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తుందో లేక లావ‌ణ్య ఫెయిల్యూర్స్‌కి బ్రేక్ వేసి మ‌రో హిట్ ఇస్తుందో చూడాలి. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన‌ యుద్ధం శ‌ర‌ణం వ‌చ్చే నెల 8న విడుద‌ల కానుంది.