close
Choose your channels

Manchu Manoj: జంటగా గణపతికి పూజలు.. భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ పెళ్లాడనున్నారా..?

Monday, September 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నారా అంటే అవుననే కనిపిస్తున్నాయి పరిణామాలు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పేరున్న రాజకీయ కుటుంబాల్లో ఒకటైన భూమా ఫ్యామిలీకి ఆయన అల్లుడు కాబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఆదివారం హైదరాబాద్ నగరంలోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు మంచు మనోజ్ వచ్చారు. ఆయనొక్కరే వచ్చుంటే ఏముండేది కాదు.. కానీ మనోజ్ వెంట దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి రావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో మనోజ్- మౌనికా రెడ్డిలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తోంది. దీనిపై త్వరలో స్పందిస్తానని మనోజ్ చెప్పడం వీరిద్దరి రిలేషన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

ప్రణతితో విడాకుల తర్వాత ఒంటరిగానే మనోజ్:

కాగా.. మంచు మనోజ్ ప్రణతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2019లో విడాకులు తీసుకుంది. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నోసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు తాజా ఘటన వెనక కథేంటో అర్ధం కావడం లేదు. పెళ్లి తన వ్యక్తిగత అంశమన్నారే తప్ప.. మనోజ్ మీడియా ప్రశ్నలను ఖండించకపోవడం గమనార్హం. రెండు కుటుంబాల మధ్య వున్న సాన్నిహిత్యంతోనే మనోజ్- మౌనికాలు జంటగా వినాయకుడిని దర్శించుకున్నారా..? లేక మీడియా చెబుతున్నట్లు ఇద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అనే దానికి కాలమే సమాధానం చెప్పనుంది.

మౌనికా రెడ్డికి గతంలోనే పెళ్లి, ఐదేళ్ల బాబు కూడా:

ఇకపోతే.. భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే, ఇమెకు కూడా గతంలోనే పెళ్లయ్యింది. బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. గణేష్‌ నుంచి వీడిపోయాక.. మౌనికా రెడ్డి హైదరాబాద్‌లో వుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.