ఇంద్ర‌గంటి అదే ఫాలో అవుతారా?

  • IndiaGlitz, [Saturday,June 16 2018]

ఓ సినీ తార‌కి, సినిమాలంటే అస్స‌లు ఇష్టం లేని ఓ యువ‌కుడికి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థగా తెర‌కెక్కిన చిత్రం స‌మ్మోహ‌నం. సుధీర్ బాబు, అదితి రావ్ హైద‌రీ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ రూపొందించారు. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకి హిట్ టాక్ వ‌చ్చింది. అలాగే మంచి రివ్యూస్ కూడా ఇచ్చాయి. ఇక్క‌డ ఓ విష‌యం ప్ర‌స్తావించాలి.. ఇంద్ర‌గంటి గ‌త రెండు చిత్రాలు జెంటిల్ మ‌న్‌, అమీ తుమీ కూడా జూన్ నెల‌లోనే విడుద‌ల‌వ‌డం.

2016లో జూన్ 17న జెంటిల్ మ‌న్ రిలీజ్ కాగా.. 2017లో జూన్ 9న అమీ తుమీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్పుడు స‌మ్మోహ‌నం కూడా అదే జూన్ నెల‌లో రిలీజ్ కావ‌డం.. వ‌రుస‌గా మూడో సంవత్స‌రంలోనూ విజ‌యం ద‌క్క‌డం విశేషం. మొత్తానికి.. ఇంద్ర‌గంటికి జూన్ నెల బాగానే అచ్చొచ్చింది. తదుప‌రి చిత్రం విష‌యంలోనూ ఇదే ఫార్ములాని ఆయ‌న ఫాలో అవుతారేమో చూడాలి.

More News

ద‌ర్శ‌కుడు తేజ‌కు స్పెష‌ల్ డే

కొత్త తార‌ల‌తో సినిమాలు రూపొందించి సంచ‌ల‌న విజ‌యాలు అందుకునే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మందే ఉంటారు.

ర‌జనీకాంత్ జోడీగా కాజ‌ల్‌?

తెలుగులోని ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఆడిపాడిన క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

ఈ నెల 21న 'ఆయుష్మాన్ భవ' టీజర్ విడుదల

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో

ఒక రోజు గ్యాప్‌లో రెండు చిత్రాలు

మెలోడీ సాంగ్స్‌తో తెలుగుసినీ సంగీత ప్రియుల‌ను అల‌రించిన మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్‌. 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన గోపీ సుంద‌ర్‌..

ర‌జ‌నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

ఆరు ప‌దులు దాటినా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌లో ఎనర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. యువ క‌థానాయ‌కుల‌తో పోటీప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయ‌న‌.