మంగళగిరిలో వైసీపీని 'లోకేశే' గెలిపించేస్తాడేమో!

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిన చిత్ర విచిత్రాలన్నీ మంగళగిరిలో చూపిస్తున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేశ్ మాట్లాడిన మాటలు మరిచిపోదామనుకున్న మరిచిపోలేనేవి.

లోకేశ్ ప్రచారానికి రావడంతో జీహెచ్ఎంసీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన విషయం విదితమే. అయితే సేమ్ టూ సేమ్ అలానే ప్రచారం చేస్తూ తాను పోటీ చేస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితి మరో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను చేసేలా ఉన్నారని విమర్శలు వినవస్తున్నాయి.

అసలు ఏం మాట్లాడుతున్నాడో బహుశా లోకేశ్‌‌కు అయినా అర్థమవుతుందా..? లేదా అన్నది వేలాది మంది నెటిజన్లలో మెదులుతున్న మిలియన్ల డాలర్ల ప్రశ్న. చినబాబు ప్రచారం చేయబట్టి పట్టుమని నాలుగురోజులు కూడా కాలేదు. ఈ నాలుగు రోజుల్లోనే ఎన్ని సార్లు తప్పులో కాలేశారో అంటూ అటు వైసీపీ కార్యకర్తలు.. ఇటు నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు మంగళగిరిలో వైసీపీని దగ్గరుండి లోకేశే గెలిపించేట్లున్నారని చెప్పుకుంటున్నారు.

ఇటీవల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'వివేకా హత్య చేయించారు.. తెలిసి పరవశించిపోయాను', 'ఏప్రిల్‌ 9న టీడీపీకి ఓటేయండి' అని అనడం ఇలా చెప్పుకుంటూ పోతే చినబాబు ఖాతాలో చాలానే ఉన్నాయి. ఆయన మాటలన్నీ విన్న వైసీపీ కార్యకర్తలు ఒక్క మంగళగిరిలోనే కాదు లోకేశ్‌‌ను 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయించండి అని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ మంగళగిరిలో లోకేశ్ పరిస్థితి. లోకేశ్ గురించి అటు సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో, వెబ్‌సైట్లలో వార్తలేని రోజులున్నాయా అంటే లేనేలేవనే చెప్పుకోవాలి. సో ఇంకా ఎన్నికలు 20 రోజులు ఉండటంతో మున్ముంథు ఇంకెన్ని సార్లు తప్పులో కాలేస్తారో..? ఇంకెన్ని సార్లు లోకేశ్ నోట ఆణిముత్యాలు రాలుతాయోనని నెటిజన్ల సెటైర్లేస్తున్నారు.