close
Choose your channels

సావిత్రిగా నిత్యా మీనన్.. కీర్తిని మరిపిస్తుందా?

Monday, November 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సావిత్రిగా నిత్యా మీనన్.. కీర్తిని మరిపిస్తుందా?

అలనాటి అందాల జాబిలి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటన చిత్రానికే ప్రాణం పోసిందని చెప్పాలి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తి తన హావా భావాలతో అద్భుతమైన నటనను కనబరిచింది. అలాగే కీర్తి సురేష్ లుక్ విషయంలో కూడా ఈ తరానికి సావిత్రి అంటే ఈమె నాన్న భావన కలిగేలాగా నటించింది. మరి ఇప్పుడు ఆదే పాత్రలో నిత్యా మీనన్ "యన్ టి ఆర్" బయోపిక్ లో సావిత్రిగా కనిపించ బోతోంది.

అయితే ఇప్పుడు తాజాగా నిత్యా మీనన్ సావిత్రి లుక్ లో ఉన్న ఫోటోని 'యన్ టి ఆర్' చిత్ర యూనిట్ దీపావళి శుభాకాక్షలతో అంటూ విడుదల చేసింది. మహానటి చిత్రంలో కీర్తి సురేష్ ను సావిత్రిగా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు నిత్యా మీనన్ ని ఆ పాత్రలో చూస్తారా.

సావిత్రిగా కీర్తి నటనను నిత్యా మీనన్ మరిపిస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. చూద్దాం మరి నిత్యా సావిత్రిగా కీర్తిని ఎంతవరకు మరిపిస్తుందో.... ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో! రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "యన్ టి ఆర్" చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.