నిర్మాత‌ల‌కు 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' వ‌ర్క‌వుట్ అవుతుందా?

  • IndiaGlitz, [Tuesday,November 20 2018]

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'పడి పడి లేచె మనసు'. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యూనిట్ డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని స‌న్నివేశాల విష‌యంలో యూనిట్ సంతృప్తిగా లేద‌ట‌. దాంతో రీ షూట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

అయితే అందుకు సాయిప‌ల్ల‌వి ఎక్స్‌ట్రా రెమ్యున‌రేష‌న్ అడుగుతుంది. ఇక చేసేదేమీ లేక నిర్మాత‌లు ఎక్స్‌ట్రా పేమెంట్ ఇవ్వ‌డానికి స‌రే అన్నార‌ట‌. అయితే అస‌లు విష‌య‌మేమంటే సినిమాను 15 కోట్ల రూపాయ‌ల్లోనే పూర్తి చేసి ఇస్తాన‌ని హ‌ను సినిమా ప్రారంభించే ముందు చెప్పాడ‌ట‌.

అయితే ఇప్ప‌టికే బ‌డ్జెట్ 30 కోట్ల రూపాయ‌లు దాటేసింది. మొత్తంగా నల‌బై కోట్ల‌కు చేరేలా ఉంది. కానీ ప్ర‌స్తుతానికి శ‌ర్వానంద్ మార్కెట్ పాతిక కోట్లే మరి మిగిలి మొత్తాన్ని ఎలా రాబ‌డుతుందో తెలియ‌క నిర్మాత‌లు లోపల టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.