close
Choose your channels

ప‌వ‌న్ ఆ రోల్స్  చేస్తాడా?

Saturday, June 22, 2019 • తెలుగు Comments

ప‌వ‌న్ ఆ రోల్స్  చేస్తాడా?

మొన్న మొన్న‌టి దాకా ఎన్నిక‌ల ప్ర‌చారం, ఆ త‌ర్వాత ఎన్నిక‌లు, రీసెంట్‌గా ఫ‌లితాలు.. కొన్నాళ్లు కొత్త‌గా ఎంపికైన పార్టీల‌కు హ‌నీమూన్ పీరియ‌డ్‌.. ఈ గ్యాప్ త‌ర్వాత ఎవ‌రేం చేస్తారు?  పూర్తిగా రాజ‌కీయాల‌ను న‌మ్మ‌కున్న‌వారు అక్క‌డే ఉంటారు. వారి గురించి ప్ర‌త్యేకంగా ఆలోచ‌న‌లు అస‌లు అక్క‌ర్లేదు. కానీ సినిమా వాళ్ల ప‌రిస్థితి?  సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వెళ్లిన వారి ప‌రిస్థితి ఏంటి? మ‌రీ ముఖ్యంగా సినిమాలకు దూర‌మై రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి ఏంటి? అనేది అంద‌రి ఆస‌క్తి.

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా సినిమాల‌ను ప్లాన్ చేస్తున్న‌ట్టు అప్పుడే అడ‌పాద‌డ‌పా వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే అందులో నిజం లేద‌ని అంటున్నారు ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు. ఆయ‌న కూడా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. నాగ‌బాబు మాట్లాడుతూ ``మా అన్న‌య్య చిరంజీవి విష‌యంలో జ‌రిగింది వేరు. మా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యం వేరు. ఇద్ద‌రిదీ ఒక‌టే కాదు. మా క‌ల్యాణ్ బాబు పూర్తిగా రాజ‌కీయాల‌నే న‌మ్ముకున్నాడు. ఇక సినిమాలు చేయ‌డు. కాక‌పోతే ఎప్పుడైనా అడ‌పాద‌డ‌పా మా సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేయాల్సిందే`` అని అన్నారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో త్రివిక్ర‌మ్ చేస్తాన‌న్న `కోబ‌లి`తో పాటు ఎన్నో క‌థ‌ల‌కు నాయ‌కులుగా ఎవ‌రు స‌రిపోతార‌నే చ‌ర్చ‌లు కూడా ఓ వైపు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz