రోజా వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అవుతాడా!?

  • IndiaGlitz, [Monday,December 09 2019]

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి చెమ్డాలు ఊడేలా రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం మళ్లీ మాటమార్చిన విషయమూ విదితమే. అయితే నాడు అలా.. నేడు ఇలా అంటూ సోషల్ మీడియాలో.. టీవీ చానెళ్లలో పెద్ద చర్చే జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బెత్తం దెబ్బలు ప్రస్తావనకు తెచ్చారు ఎమ్మెల్యే రోజా.

రియాక్షన్ ఉంటుందా!

‘ఒకప్పుడు తన (పవన్ కల్యాణ్) కుటుంబ సభ్యులను దూషించిన వాళ్లను చంపేద్దామని గన్ తీసుకుని వీధుల్లోకి వచ్చిన వ్యక్తి.. ఇవాళ అత్యాచారం చేస్తే రెండు బెత్తం దెబ్బలు వేయాలంటున్నారు. అత్యాచారానికి శిక్షగా రెండు బెత్తం దెబ్బలు వేయాలనడాన్ని ఖండిస్తున్నాను. చరిత్రలో రెండు చోట్ల ఓడిపోయిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణే’ అని రోజా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని కలుగజేసుకుని.. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడొద్దని ఒకింత వార్నింగ్ ఇచ్చారు. దీంతె రోజా తన విమర్శలను సభలో ఉన్న జనసేన ఎమ్మెల్యే ద్వారా పవన్ కల్యాణ్ కు తెలియజేస్తున్నట్టు సవరణ ప్రకటించారు. అయితే తనపై విమర్శలు గుప్పించేవారికి అంతే రీతిలో కౌంటరిచ్చే పవన్ కల్యాణ్.. రోజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.

More News

కష్టమొస్తే ‘గన్’ కంటే ముందే ‘జగన్’ రావాలి.. రోజా రెక్వెస్ట్!

ఆడపిల్లకు కన్నీరొస్తే ‘గన్’ కంటే ముందు వైఎస్ జగన్ వస్తాడనే నమ్మకమని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.

అఘాయిత్యాల‌కు పాల్పడితే ఉరిశిక్షే.. తేల్చేసిన జగన్!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ సంఘటన తర్వాత ప్రభుత్వాల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి.

నాకున్నది ఒక్క భార్యే.. కొందరేమో నాలుగో పెళ్లి కోసం తాపత్రయం!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’పై గత పదిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.

శివ 143 ఫస్ట్ లుక్ & ట్రైలర్ విడుదల

ఈ సందర్భంగా నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ... నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నుండి మొదటి ఓనమాలు దిద్దించింది మా అన్నయ్య కళ్యాణ్ గారు..

అబ్బే నేను వైసీపీలోకి వెళ్లట్లేదు.. మా వాళ్లు వెళ్తున్నారు..!

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని