close
Choose your channels

ప్రమోషన్లు, టీజర్‌లు, ట్రైలర్‌లు లేవు : ‘‘ పుష్ప ’’ను పోస్ట్ పోన్ చేస్తున్నారా.. అసలేం జరుగుతోంది..?

Saturday, November 13, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోవిడ్ తగ్గుముఖం పట్టడం, థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో విడుదలకు నోచుకోని చిన్నా, పెద్దా సినిమాలు వరుసపెట్టి క్యూకడుతున్నాయి. తెలుగు సినిమాకు అతిపెద్ద సీజన్‌గా చెప్పుకునే డిసెంబర్, జనవరి నెలల కోసం ఈసారి కూడా భారీ సినిమాలు లైన్‌లో వున్నాయి. ఈ రద్దీతో సినిమాలను రిలీజ్ విషయంలో మేకర్స్ గందరగోళానికి గురవుతున్నారు. ఇంతటి పోటీలో రిలీజ్ చేస్తే ఏమైనా దెబ్బ కొడుతుందా అన్న ఆలోచనలో కొందరు వున్నారు. ఇదే కోవలోకి వస్తుంది ‘‘పుష్ప’’ .

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి పార్ట్‌ని ‘‘పుష్ప ది రైజింగ్ ’’ పేరిట డిసెంబ‌ర్ 17న మూవీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు, పోస్టర్స్, లుక్స్, పాటలు అంచనాలను పెంచేశాయి. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిద్ భైర‌వ్ సింగ్ షెకావ‌త్ అనే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అల్లు అర్జున్, పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో, ర‌ష్మిక మంద‌న్న... శ్రీవ‌ల్లి అనే పాత్ర‌ను పోషిస్తున్నారు. 1980లలో చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగిన ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

అయితే పరిస్థితులు చూస్తుంటే డిసెంబ‌ర్ 17న పుష్ప వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదన్న వదంతులు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సునీల్, అనసూయల క్యారెక్టర్‌లకు సంబంధించిన పోస్టర్లు తప్పించి ఇంత వ‌ర‌కు టీజ‌ర్‌, ట్రైలర్స్ విడుద‌ల చేయ‌క‌పోగా, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్న‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డమే ఈ అనుమానపు చూపులకు కారణం. డిసెంబర్ 17న చెప్పిన విధంగా రాకపోతే గనుక డిసెంబర్ 24న పుష్ప రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ భోగట్టా. అదే నిజమైతే డిసెంబర్ 24న రిలీజ్ కానున్న నాని శ్యామ్‌ సింగరాయ్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ వుంది. దీంతో నాని సినిమాను వారం ముందుకు జరిపే అవకాశం వుంది. మరి ఇవి కేవలం వదంతులేనా.. లేదంటే బయటకు సంకేతాలు వచ్చాయా అన్న సంగతి తెలియాలంటే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.