ప‌దేళ్ల ప్రేమ‌ను తిరిగిచ్చేస్తాడ‌ట రామ్..

  • IndiaGlitz, [Monday,January 11 2016]

దేవ‌దాసు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. తొలి సినిమాతో రామ్ సంచ‌ల‌న విజ‌యం సాధించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. ఇటీవ‌ల నేను..శైల‌జ సినిమాతో సూప‌ర్ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు రామ్. ఇదిలా ఉంటే.. వై.వి.ఎస్.చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన దేవ‌దాసు సినిమా విడుద‌లై నేటికి స‌రిగ్గా ప‌దేళ్లు. అంటే హీరో రామ్ కెరీర్ ప్రారంభించి నేటికి ప‌దేళ్లు పూర్తి అయ్యింది.

ఈ సంద‌ర్భంగా రామ్ ట్విట్ట‌ర్ లో...ఈ ప‌దేళ్లు నా లైఫ్ లో బ్యూటీఫుల్ ఇయ‌ర్స్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కార‌ణం ప్రేక్ష‌కులు చూపించిన ప్రేమే. మీరు చూపించిన ప్రేమ‌కు ప్ర‌తిఫ‌లంగా చివ‌రి వ‌ర‌కు మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను అంటూ స్పందించాడు. ఓ వైపు కెరీర్ లో 10 ఇయ‌ర్స్ పూర్తి చేసుకోవ‌డం...మ‌రో వైపు నేను..శైల‌జ సినిమా స‌క్స‌స్ ఈ రెండింటిని ఓకేసారి ఎంజాయ్ చేస్తున్న రామ్ ఫ్యూచ‌ర్ లోమ‌రిన్ని స‌క్సెస్ ఫుల్ మూవీస్ అందిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

డైరెక్టర్ ఎన్.శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఆడియో

రాజ్ తరుణ్,ఆర్తన జంటగా నటించిన చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు.శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సర్వంత్రామ్‌ క్రియేషన్స్ ,గుడ్ సినిమా గ్రూప్ చిత్రం క‌ళావ‌తి

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌య్యి ఇప్ప‌డు అర‌ణ్మ‌యి 2 గా ఇప్ప‌టికే త‌మిళ‌నాట సంచ‌ల‌నాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో క‌ళావ‌తి అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.

రాజమండ్రి లో ఘనంగా జరిగిన సునీల్ క్రిష్ణాష్టమి ఆడియో వేడుక

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్ణాష్టమి.

శర్వా నెక్ట్స్ ప్రాజెక్ట్ కు రెడీ....

చాలా సంవత్సరాలు సక్సెస్ లేకుండా ఇబ్బంది పడ్డ శర్వానంద్ ఇప్పుడు రన్ రాజా రన్,మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు చిత్రాలతో వరుస విజయాలు సాధించాడు.

దాస‌రిని క‌లిసిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు..

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి ని క‌ల‌సిన‌ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు...రామ్ గోపాల్ వ‌ర్మ‌. నిన్నసాయంత్రం దాస‌రి, వ‌ర్మ క‌లిసారు.