close
Choose your channels

వారికి రాని స‌క్సెస్ స‌మంత‌కు వ‌స్తుందా?

Friday, September 18, 2020 • తెలుగు Comments

వారికి రాని స‌క్సెస్ స‌మంత‌కు వ‌స్తుందా?

లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేసిన స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని ఇక సెట్స్‌లోకి అడుగుపెట్ట‌డానికి రెడీ అవుతుంది. అయితే త‌దుప‌రి సినిమాలో స‌మంత ఓ ఛాలెంజింగ్ రోల్‌లో న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. వివ‌రాల మేర‌కు త్వ‌ర‌లోనే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లయ్యేలా సోనీ పిక్చ‌ర్స్ నిర్మాణంలో ఓ భారీ సినిమా రూపొంద‌నుంది. ‘గేమ్ ఓవ‌ర్‌’ వంటి థ్రిల్ల‌ర్ సినిమాను తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఇందులో స‌మంత చెవులు వినిపంచ‌ని, మాట‌లు మాట్లాడ‌లేని దివ్యాంగురాలి పాత్ర‌లో క‌నిపించనున్నార‌ట‌. ఈ మ‌ధ్యన‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా కూడా అలాంటి పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పుడు వారి బాట‌లోనే స‌మంత కూడా అడుగుపెడుతుంది. మ‌రి వారికి రానీ స‌క్సెస్ స‌మంత ద‌క్కించుకుంటుందేమో చూడాలి.

వారికి రాని స‌క్సెస్ స‌మంత‌కు వ‌స్తుందా?

అక్కినేని కోడ‌లుగా మారిన త‌ర్వాత స‌మంత రేంజ్ మ‌రో లెవ‌ల్‌లోకి వెళ్లింది. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే పెర్ఫామెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లే వ‌స్తున్నాయి. అలాగే ఆమె సినిమాల‌ను ఎంచుకుంటుంది. మ‌రో ప‌క్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా కూడా నిలుస్తుంది. సినిమాల‌తోనే కాకుండా డిజిట‌ల్ రంగంలోనూ ఆమె అడుగు పెట్టారు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ని తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేయగా అందులో సమంత నటించిన సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత `ద ఫ్యామిలీ మేన్` వెబ్ సిరీస్ సీజ‌న్‌2లో ఓ నెగ‌టివ్ పాత్ర‌లో న‌టించింది. ఇలా డిఫ‌రెంట్‌గా ఆలోచిస్తూ కెరీర్‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సమంత అక్కినేని.

Get Breaking News Alerts From IndiaGlitz