close
Choose your channels

బాల‌య్య ప‌క్క‌న శ్రియ‌?

Wednesday, June 19, 2019 • తెలుగు Comments

బాల‌య్య ప‌క్క‌న శ్రియ‌?

బాల‌య్య స‌ర‌స‌న శ్రియ అన‌గానే అంద‌రికీ వారు గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా గుర్తుకొస్తాయి. శ్రియ పెళ్ల‌యిన త‌ర్వాత తెలుగు సినిమాల్లో న‌టించ‌లేదు. త‌ను చిన్న‌త‌నంలో నేర్చుకున్న క‌థ‌క్‌ను విదేశాల్లో ప్ర‌ద‌ర్శిస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెను ఓ తెలుగు సినిమా కోసం సంప్ర‌దిస్తున్న‌ట్టు వార్త‌లొచ్చాయి. 

ఆ సినిమానే నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న చిత్రం. సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. ఇందులో ఇద్ద‌రు నాయిక‌ల‌కు చోటుంద‌ని, అందులో ఓ నాయిక‌గా శ్రియ‌ను ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే నెల నుంచి సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకోనుంది. బాల‌కృష్ణ స‌ర‌స‌న శ్రియ ఇంత‌కు ముందు `చెన్న‌కేశ‌వ‌రెడ్డి`, `గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి`, `పైసా వ‌సూల్‌`లో న‌టించింది.

Get Breaking News Alerts From IndiaGlitz