హీరోయిన్ విష‌యంలో సుకుమార్ ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యేనా..?

  • IndiaGlitz, [Monday,March 01 2021]

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో సుకుమార్ ఒక‌డు. పుష్ప సినిమాతో ఆయ‌న పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా కూడా మారబోతున్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా ఒక హీరోతో సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత మ‌రో హీరోతో సినిమా చేసే సుకుమార్‌.. ఈసారి భిన్నంగా ముందుగానే హీరోను లాక్ చేసేశాడు. ఆ హీరో ఎవ‌రో కాదు.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వీరి కాంబినేష‌న్‌లో సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సలగంశెట్టి నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాను పూర్తి చేస్తూనే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను సైలెంట్‌గా చేస్తూ వ‌స్తున్నాడ‌ట‌. అందులో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న‌ను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని సుక్కు భావిస్తున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీలో ర‌ష్మిక హీరోయిన్‌. ఈమె వ‌ర్కింగ్ స్టైల్‌కు ఫిదా అయిన సుకుమార్ ఆమెనే నెక్ట్స్ మూవీకి కూడా తీసుకోవాల‌నుకుంటున్నాడ‌ని టాక్. ఇదే క‌నుక నిజ‌మైతే గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి న‌టించే మూడో చిత్ర‌మిదే అవుతుంది. మరి హీరోయిన్ విషయంలో సుకుమార్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి. ఇక పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దాని త‌ర్వాత సుకుమార్ సినిమానే ట్రాక్ ఎక్కిస్తాడు.

More News

గ్రాండ్‌గా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ప్రి రిలీజ్ ఈవెంట్

తెలుగు చిత్రసీమలో హాకీ స్పోర్ట్స్ నేపథ్యంతో రూపొందిన తొలి సినిమా ఏ1 ఎక్స్‌ప్రెస్. యంగ్ హీరో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్,

బెల్లంకొండ శ్రీనివాస్‌కి హీరోయిన్ దొరికిందా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగు సినిమా పాన్ ఇండియాగా మారిన త‌రుణంలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాల‌నుకుంటున్నాడు.

మిర్చి హీరోయిన్‌.. త‌ల్లి కాబోతుంది

ప్ర‌భాస్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం  ‘మిర్చి’. రైట‌ర్ కొర‌టాల శివ ఈ సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారాడు.

‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఆకాశ్‌పూరి హీరోగా రూపొందుతోన్న ‘రొమాంటిక్’ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్, చార్మి నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు.

కోవిడ్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి,