జనసేనలోని ‘ఒకే ఒక్కడు’ జంప్ అవుతాడా!?

  • IndiaGlitz, [Thursday,June 13 2019]

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ‘ఒకే ఒక్కడు’ జంప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం వెనుక ఆంతర్యమేంటి..? అసలు ఈ భేటీ వెనుక అర్థం పరమార్థమేంటి..? అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా పలకరించి, అభినందనలు తెలిపారు. ఆయనతో సీఎం జగన్‌ కొద్దిసేపు మాట్లాడి అనంతరం సభలోకి వెళ్లిపోయారు. దీంతో జనసేన ఎమ్మెల్యే జంప్ అవుతాడా..? దాదాపు జంప్ అయిపోయినట్లే అని పెద్ద ఎత్తున కథనాలు రాసేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాల మరుసటి రోజు నుంచి జనసేన తరఫున పోటీచేసి కొందరు అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోగా.. ద్వితియశ్రేణి నేతలు భారీ ఎత్తున అటు వైసీపీ.. ఇటు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇటీవలే మాజీ మంత్రి, జనసేన కీలకనేత రావెల కిశోర్ రాజీనామా చేసి కమలం గూటికి వెళ్లడానికి సిద్ధపడిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జగన్‌తో భేటీ అయిన రాపాక విషయంలోనూ అటు జనసేన.. ఇటు వైసీపీ శ్రేణులు సైతం ఇదే అనుకున్నారు.

నేను పూర్తిగా సహకరిస్తా..!

వైఎస్‌ జగన్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గ విస్తరణలో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటించారని ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. శాసనసభలో జనసేన వాణిని వినిపిస్తానని.. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి విజయం సాధించానని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మరోసారి శాసనసభలో అడుగు పెడుతున్నానని తెలిపారు. జనసేన పార్టీ శాసనసభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటుందని వరప్రసాద్ తెలిపారు. కాగా.. ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే తాను జనసేనలోనే ఉంటానని ఇటీవలే వరప్రసాద్ స్పష్టం చేసిన విషయం విదితమే.

జంప్ అయిన వైసీపీ తీసుకోదేమో..!

ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 151 స్థానాల్లో కనివినీ ఎరుగని రీతిలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీకి ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను తీసుకోదు.. తీసుకునే సాహసం చేయదు కూడా. వచ్చే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి..? మళ్లీ ఉపఎన్నికలు ఇదంతా పెద్ద తతంగమే. కాబట్టి బహుశా అటు టీడీపీ కానీ.. ఇటు ఏకైక ఎమ్మెల్యే రాపాక కానీ బీజేపీలాంటి పార్టీల్లోకి వెళ్లడానికి యత్నిస్తారేమో గానీ.. వైసీపీలోకి వెళ్లడానికి మాత్రం ప్రస్తుతానికి సాహసించరని చెప్పుకోవచ్చు.

ఇంతకీ ఎవరీ వన్ అండ్ ఓన్లీ..!

కాగా.. అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండుసార్లు పోటీచేసినప్పటికీ గెలవకలేకపోవడం గమనార్హం. కాగా.. రాపాక తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి, టీడీపీ అభ్యర్థులపై పోరాడి 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

More News

కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీలోకి రేవంత్, కోమటిరెడ్డి!?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయినట్లేనా..? ఉన్న అరకొర ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీని వీడి మరో జాతీయ పార్టీ గూటికి చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారా..?

ఆమెను త‌మ‌న్ సింగ‌ర్‌గా మార్చేస్తున్నాడా?

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ త‌న సినిమాల్లో హీరో, హీరోయిన్‌ల‌తో పాట‌లు పాడించేస్తుంటాడు. ఈ విష‌యం చాలా సినిమాల్లో రుజువైంది.

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం.. వ‌రుణ్ తేజ్ స్పంద‌న‌

యువ క‌థానాయ‌కుడు, మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్‌కు ఈరోజు తృటిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

దాంట్లో ఇద్ద‌రూ ఒక‌టేన‌ట‌

బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌, టాలీవుడ్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మంచి స్నేహితులు. స‌ల్మాన్, హైద‌రాబాద్ వ‌చ్చిన ప్ర‌తి సంద‌ర్భంలో చ‌ర‌ణ్‌ను క‌లుస్తాడు. అలాగే చ‌ర‌ణ్‌, ముంబై వెళ్లిన ప్ర‌తిసారి సల్మాన్‌ఖాన్‌

గిఫ్ట్‌పై ఆశ‌తో రూ.85000ల‌ను పొగొట్టుకున్న హీరోయిన్‌

సైబ‌ర్ నేర‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి మొర్రో అని పోలీసులు మొత్తుకుంటున్న ప్ర‌జ‌ల‌కు ఏమాత్రం ప‌ట్ట‌దు.