close
Choose your channels

మోక్ష‌జ్ఞ గురించి అప్పుడే ఆలోచిస్తానంటున్న... 

Sunday, January 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మోక్ష‌జ్ఞ గురించి అప్పుడే ఆలోచిస్తానంటున్న... 

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై బాల‌కృష్ణ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

మోక్ష‌జ్ఞ‌ను అతిథి పాత్ర‌లో ప‌రిచ‌యం చేయ‌డం బాల‌కృష్ణ‌కు ఇష్టం లేద‌ట‌. అందుక‌ని 'య‌న్‌.టి.ఆర్‌' బ‌యోపిక్‌లో న‌టింప‌చేయ‌లేద‌ట‌. ప్ర‌స్తుతం ఈ బ‌యోపిక్‌లో రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత బోయపాటి సినిమాతో బాల‌య్య బిజీ కాబోతున్నాడు.

ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత మోక్ష‌జ్ఞ సినిమా గురించి ఆలోచిస్తాన‌ని బాల‌య్య చెప్పేశారు. అయితే త‌న స్వంత బ్యాన‌ర్ ఎన్‌.బి.కె.ఫిలింస్ బ్యాన‌ర్‌లోనే మోక్ష‌జ్ఞ సినిమా ఉంటుంద‌ని బాల‌య్య క్లారిటీ ఇచ్చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.