ఎన్టీఆర్‌ లాగే విజయ్ దేవరకొండ.. మించిపోతాడా!

  • IndiaGlitz, [Monday,August 12 2019]

ఇదేంటి టైటిల్ చూడగానే కాస్త కన్ఫూజ్‌గా ఉంది కదా..!. ఎన్టీఆర్ ఒకప్పుడు నటించిన పాత్రలో ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. అయితే ఈ పాత్రతో ఎన్టీఆర్‌ను విజయ్ మించిపోతాడా..? లేకుంటే అట్టర్ ప్లాప్ అవుతాడా అన్నది ఇప్పుడు జూనియర్-దేవరకొండ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చసాగుతోంది. ఇంతకీ ఆ పాత్రేంటి..? ఈ కథేంటి..? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

‘జై లవకుశ’ సినిమాలో మూడు పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ మూడింటిలో నెత్తిగా(మాటలు సరిగ్గా పలకలేని) మాట్లాడే వ్యక్తిగా ఎన్టీఆర్.. అభిమానులను మైమరిపించాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి పాత్రలోనే నటిస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో తెలియట్లేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్‌సైట్స్‌లో పెద్ద ఎత్తున వార్త హల్ చల్ చేస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్‌లాగే విజయ్ దేవరకొండ సక్సెస్ అవుతాడా లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

వాస్తవానికి గత కొన్ని రోజులుగా విజయ్-పూరీ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం విదితమే. సూపర్ స్టార్ మహేశ్ అనుకున్న ‘జనగణమన’ను విజయ్‌తో ట్రాక్‌లోకి తెస్తారని అప్పట్లో పుకార్లు రాగా.. ఆ తర్వాత మళ్లీ ‘కేజీఎఫ్’ హీరో యష్‌తో పూరీ తెరకెక్కిస్తున్నట్లూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా.. విజయ్‌ కోసం సరికొత్త క్రేజీ పాత్ర తయారు చేశాడని.. డైరెక్షన్‌తో పాటు స్వయంగా పూరీ నిర్మిస్తాడని టాక్ నడుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో..? అనేది తెలియాలంటే దీనిపై పూరీ, విజయ్‌లు అధికారికంగా స్పందించాల్సి వుంది.

More News

ఆమిర్‌తో విజయ్ సేతుపతి

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విజయ్ సేతుపతి ఇప్పుడు విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

బాహుబలి మనసుకి బాలీవుడ్ భామ ఫిదా!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటీనటులగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్న ఉపేంద్ర

సినీ హీరో, రాజకీయ నాయకుడు ఉపేంద్ర బెంగళూరులో ఉద్యమానికి తెర తీశాడు. కన్నడిగులకే ప్రభుత్వం ఉద్యోగాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఫ్యాన్స్ వల్ల క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తన ఫ్యాన్స్ చేసిన పనికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళ్తే..

బిగ్‌బాస్ నుండి తమన్నా ఔట్

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 3 మూడోవారం ఎలిమినేషన్ ముగిసింది.