'విన్నర్' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం 'విన్న‌ర్‌'. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. చిత్రీక‌రించాల్సిన పాట‌ను ఈ నెలాఖ‌రున చిత్రీక‌రిస్తాం. ఫిబ్ర‌వ‌రి 19న ఆడియో ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించి ఫిబ్ర‌వ‌రి 24న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామ‌ని నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి తెలిపారు.

త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. 'విన్న‌ర్' అనే టైటిల్ మా క‌థ‌కు యాప్ట్. టైటిల్ విన్న వారంద‌రూ పాజిటివ్‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సితార సితార అంటూ సాగే పాట‌ను ఇటీవ‌ల ప్ర‌ముఖ హీరో మ‌హేశ్‌ విడుద‌ల చేశారు. ఆ పాట అన్ని చోట్లా బాగా వినిపిస్తోంది. మ‌రో ఐదుగురు సెల‌బ్రిటీలు మిగిలిన ఐదు పాట‌ల‌ను విడుద‌ల చేస్తారు. త‌మ‌న్ చాలా మంచి సంగీతాన్నిచ్చారని ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌ల‌నేని తెలిపారు.

More News

'దేవిశ్రీప్రసాద్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

అర్జున్- జెడి చక్రవర్తిల 'కాంట్రాక్ట్'

ప్రముఖ కథానాయకులు అర్జున్, జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా, దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'కాంట్రాక్ట్ '.

డా.రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడ వేగ 126.18ఎం' ఫస్ట్ లుక్ రిలీజ్

అంకుశం, మగాడు, అగ్రహం వంటి తెలుగు చిత్రాల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కథానాయకుడు డా.రాజశేఖర్

విడుదల కి ముందే 100 కొట్ల క్లబ్ లో సూర్య నటించిన 'S3-యముడు-3'

వరుసగా పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం "S3-యముడు-3".

రథ సప్తమి సందర్భంగా ప్రచార రథాన్ని ప్రారంభించిన సునిల్ నటించిన 'ఉంగరాల రాంబాబు'

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని...