ఈ నెల 24న 'విన్నర్' రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,February 14 2017]

పులికి ఎదురెళ్ళే ధైర్యం... పాతికమందిని మట్టుబెట్టే బలం... గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ... ఆకుర్రాడి సొంతం. ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం... గెలిచి తీరడం అతడి నైజం! మరి, ఆ కుర్రాడి కథేంటోమహాశివరాత్రికి చూడమంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు యుట్యూబ్ లోఅద్భుతమైన స్పందన లభిస్తోంది. 20 లక్షల మంది (టు మిలియన్స్) నెటిజన్లు టీజర్ ను వీక్షించారు.

'రేయ్.. నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గడ్డిపోచని కాదు, గడ్డపారని! దిగిపోద్ది' అని సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ తోపాటు 'పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు. కానీ, ఒక్కడు మాత్రం ఎదురెళతాడు. పట్టుమని పాతికేళ్ళు కూడాఉండవు. కానీ, పెట్టుకున్నారంటే పాతికమందికి పైనే పోతారు' వంటి డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ లోచూపించిన హార్స్ రేసింగ్ సన్నివేశాలు బాగున్నాయని చూసినవాళ్లు ప్రశంసిస్తున్నారు. టర్కీలో భారీ బడ్జెట్ తో ఈసన్నివేశాలను చిత్రీకరించారు.

హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు 'నా బీసీ సెంటర్లు..' అనే పాటను మాస్ మహారాజా ట్విట్టర్లో విడుదలచేయనున్నారు.

ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ - "త‌నకు జ‌న్మ‌నిచ్చిన తండ్రిని, మ‌న‌సిచ్చిన అమ్మాయిని గెలవ‌డం కోసం ఓయువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా. 'విన్న‌ర్' అనే టైటిల్ మా క‌థ‌కు యాప్ట్. ట్రైలర్ చూసిన వారంతా ఆ మాటేఅంటున్నారు. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. త‌మ‌న్ చాలా మంచిసంగీతాన్నిచ్చారు. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేలాసినిమాను తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ - "ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 19న ప్రీ ​ రిలీజ్ వేడుక‌ను ఘ‌నంగానిర్వ‌హించ‌నున్నాం. మా సినిమాలోని ఒక్కో పాట‌ను ఒక్కో సినీ ప్ర‌ముఖుడితో విడుద‌ల చేయిస్తున్నాం. అందులో భాగంగానేసూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు 'సితార సితార..' అనే పాట‌ను, సమంత 'పిచ్చోణ్ణే అయిపోయా..' పాటను, సంగీత దర్శకుడు అనిరుధ్'సూయ సూయ.. అనసూయ..' పాటను విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మాస్ మహారాజా రవితేజ 'నాబీసీ సెంటర్లు..' పాటను విడుదల చేయనున్నారు. మిగతా పాటలను కూడా ఒక్కొక్క సెలబ్రిటీ విడుద‌ల చేస్తారు. త‌మ‌న్ చాలామంచి సంగీతాన్నిచ్చారు. మా ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. సినిమా మీద చాలా కాన్ఫిడెన్ట్ గాఉన్నాం. మ‌హా శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని ఈ నెల 24న సాయిధ‌ర‌మ్‌తేజ్ కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్ల‌లో చిత్రాన్ని విడుద‌లచేస్తున్నాం'' అని తెలిపారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

More News

చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్ 'ఏంజెల్'

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్.

శంషాబాద్ వద్ద భారీ సెట్ లో 'బెవర్స్' ఫైట్ చిత్రీకరణ

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు,ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడవ షెడ్యూల్

హార్వర్డ్ యూనివర్శిటీలో పవన్ కీలకోపన్యాసం

జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన అమెరికా పర్యటనలో చిట్టచివరిదీ… కీలకమైన ప్రసంగంతో మరోసారి ఆకట్టుకున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ ప్రసంగించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ భారత కాలమానం ప్రకారం

ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న సునీల్ - శంకర్ ల సినిమా!

సునీల్ కథానాయకుడిగా ఎన్.శంకర్ దర్శకత్వంలో మలయాళం హిట్ సినిమా "2కంట్రీస్"కు

రాజ్ విరాట్, కిషోర్, గ్రేస్...'బీప్' షార్ట్ ఫిల్మ్ కు అద్భుతమైన స్పందన

కిషోర్ మారిశెట్టి, గ్రేస్ జంటగా నటించిన షార్ట్ ఫిల్మ్ బీప్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది ఈ లఘు చిత్ర ట్రైలర్. చాలా చిత్రాలను తలదన్నే రీతిలో కట్ చేసిన ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందనతో పూర్తి సినిమా ఎప్పుడు వస్తుందా అనే అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలకు ఫుల్ స్టాప్ పెడుతూ...