లక్కీ డైరెక్టర్‌తో మరోసారి

  • IndiaGlitz, [Thursday,November 22 2018]

యాక్షన్‌ హీరో ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో గోపీచంద్‌ ఇప్పుడు ఏ సినిమా చేయాలనే దానిపై ఓ క్లారిటీ తెచ్చుకున్నాడు. 'పంతం' సినిమా తర్వాత గోపీచంద్‌ మరే సినిమా ఒప్పుకోలేదు. ఓ కొత్త దర్శకుడితో చేయాలనుకున్న సినిమా కూడా ఆగిపోయింది. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ సినిమా చేస్తాడని వార్తలు కూడా వినిపించాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం గోపీచంద్‌, శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని సాధించాయి. శ్రీవాస్‌ గత చిత్రం 'సాక్ష్యం' బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఈ తరుణంలో శ్రీవాస్‌, గోపీచంద్‌తో చేతులు కలుపుతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడనుంది.