close
Choose your channels

14 ఏళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌తో...

Saturday, February 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

14 ఏళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌తో...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేయ‌బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చిలో సినిమా ప్రారంభం కానుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇందులో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కీర్తిసురేష్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చిన‌ట్లు కూడా స‌మాచారం.

అయితే లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రంలో న‌య‌న‌తార‌ను హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి మురుగ‌దాస్ ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. రీసెంట్‌గా ఆమెను క‌లిసి క‌థ‌ను కూడా వినిపించార‌ని టాక్‌. ర‌జ‌నీకాంత్‌తో న‌టించ‌డానికి న‌య‌న ఓకే అంటే 14 ఏళ్ల త‌ర్వాత ర‌జ‌నీతో న‌య‌న న‌టించ‌డానికి ఓకే అన్న‌ట్లు అవుతుంది. చంద్ర‌ముఖిలో ర‌జ‌నీతో న‌య‌న న‌టించింది. త‌ర్వాత శివాజీ, క‌థానాయ‌కుడు చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.