మ‌రోసారి ర‌వితేజ‌తో..

  • IndiaGlitz, [Monday,December 04 2017]

మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌కి ఇటీవ‌ల కాలంలో బాగా క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే.. మ‌రో మాట లేకుండా చెప్ప‌గ‌లిగే పేరు త‌మ‌న్ అని. కిక్‌తో మొద‌లైన ఈ ఇద్ద‌రి ప్ర‌యాణం ఆ త‌రువాత ఆంజ‌నేయులు, మిర‌ప‌కాయ్‌, వీర‌, నిప్పు, బ‌లుపు, ప‌వ‌ర్‌, కిక్ 2 వ‌ర‌కు కొన‌సాగింది. అంటే.. కిక్ చిత్రంతో వీరి జ‌ర్నీ మొద‌లైతే.. ఆ సినిమా సీక్వెల్ కిక్‌2 తో ఈ కాంబినేష‌న్‌కి బ్రేక్ ప‌డింద‌న్న‌మాట‌.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వీరి క‌ల‌యిక‌లో తొమ్మిదో సినిమా రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ర‌వితేజ‌, శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా త‌మ‌న్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశ‌ముంది. శ్రీ‌నువైట్ల‌, త‌మ‌న్‌ది హిట్ కాంబినేష‌న్ నే. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో దూకుడు, బాద్ షా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన ఆగ‌డు, బ్రూస్‌లీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

More News

నాగ్‌, వ‌ర్మ టైటిల్స్ ఇవి..

శివ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో ఆ త‌రువాత వ‌చ్చిన అంతం, గోవిందా గోవింద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

స‌మంత పాత్ర గురించి కీర్తి సురేష్ ఏమందంటే..

లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం 'మహానటి'. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మోహన్ బాబు (ఎస్.వి.ఆర్), దుల్కర్ సల్మాన్ (జెమినీ గణేషన్), డైరెక్టర్ క్రిష్ (కె.వి.రెడ్డి), డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (సింగీతం శ్రీనివాస రావు) ముఖ్య పాత్రలు పోషి

వెంకీ.. నాలుగు చిత్రాలు

2013లో ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్. ఆ త‌రువాత ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక సినిమాకే ప‌రిమితం అవుతూ వ‌స్తున్నారు.

రానా, చైత‌న్య‌.. ఇద్ద‌రిలో ఎవ‌రు?

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యువ‌ దర్శకుడు అనిల్ రావిపూడి. తన తదుపరి చిత్రానికి 'ఎఫ్2' అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేసారు. అంతేకాకుండా.. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా అని కూడా ఆయ‌న వెల్లడించారు.

'సంఘమిత్ర' షూటింగ్ తేదీ ఖరారు

తమిళ దర్శకుడు సుందర్. సి రూపొందిస్తున్న భారీ బ‌డ్జెట్‌ సినిమా 'సంఘమిత్ర'. ప్రస్తుతం చెన్నైలో ప్రీ-ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి.  రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ..  ఒక తమిళ చారిత్ర‌క గాధగా రూపొందించబడుతుంద‌ని తెలిసింది.