ఆస్ట్రేలియా పార్లమెంటులో మహిళపై అత్యాచారం!

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

ఆస్ట్రేలియా పార్లమెంటులోని రక్షణ మంత్రిత్వశాఖలో ఓ మహిళపై అత్యాచారం జరిగిందనే వార్త ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సదరు కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని.. దీనిని బయటకు పొక్కకుండా అధికారులు యత్నించారని.. అంతేకాకుండా ఫిర్యాదు కూడా చేయరాదంటూ తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పౌరుల హక్కులను కాపాడేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు చట్టాలు చేయాల్సిన పార్లమెంటులోనే మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన ఈ ఘటన 2019లో జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపడంతో స్వయంగా ప్రధాని స్కాట్ మారిసన్ స్వయంగా బాధితురాలికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టి దోషులపై చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.

పని ప్రదేశాలలో మహిళలు ఎలాంటి వివక్ష ఎదుర్కోకూడదని మారిసన్ పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో పనిప్రదేశాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా స్టేఫానీ ఫాస్టర్‌ అనే అధికారిని నియమించారు. కాగా.. రక్షణశాఖ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో ప్రధాని నేతృత్వంలోని అధికారికి లిబరల్ పార్టీకి చెందిన తన సహోద్యోగి ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు ఆరోపించారు. 2019లో వారందరూ ఒకరోజు రాత్రి పార్టీ చేసుకున్న సందర్భంగా ఈ దారుణం జరిగిందన చెప్పారు. ఆ సమయంలోనే తాను పోలీసులను ఆశ్రయించానని, కానీ తన కేరీర్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే భయంతో మిన్నకుండిపోయానని ఆమె పేర్కొన్నారు.

కాగా.. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తమ దృష్టికి తెచ్చినట్టు పోలీసులు సైతం అంగీకరించారు. అలాగే ఘటన గురించి లిండా కార్యాలయంలోని సీనియర్ సిబ్బంది దృష్టికి కూడా తెచ్చానని బాధితురాలు తెలిపారు. ఆ తరువాత.. అత్యాచారం జరిగిన కార్యాలయంలోనే ఓ సమావేశానికి హాజరు కావాలంటూ కార్యాలయ ఉన్నతాధికారులు తనను కోరినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ మంత్రి లిండా కూడా తనకు ఫిర్యాదు అందిన విషయాన్ని సోమవారం అంగీకరించారు. ఫిర్యాదు చేయకుండా మహిళపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.

More News

శిష్యుడికి ఉప్పెనంత ప్రేమతో!: సుకుమార్

శిష్యుడు ప్రయోజకుడై మంచి స్థాయికి చేరుకుంటే ఆ గురువు కంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. వాడు నా శిష్యుడంటూ చెప్పుకుంటున్నప్పుడు ఆ గురువు కళ్లల్లో ఓ మెరుపు మెరుస్తుంది.

నరేంద్ర మోడీపై ట్వీట్ చేసిన చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ బ్యూటీ

నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఓవియా చిక్కుల్లో పడ్డారు. ఈ చిక్కులను ఆమె తనకు తాను క్రియేట్ చేసుకున్నారు మరి. అసలు ఇంతకీ ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..

తూచ్.. వర్షాలు రాకూడదనలేదు: కొత్త మేయర్ విజయలక్ష్మి

నగరంలో వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడ్డాయని, అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పడమే తన ఉద్దేశమని విజయలక్ష్మి పేర్కొన్నారు.

'ఉప్పెన' నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో తెలిస్తే...

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తెలంగాణలో ‘హస్త’మిస్తున్నా.. వీళ్లు మారరా?

కూర్చొన్న చోటు నుంచి కదలొద్దు.. కానీ విజయం కావాలంటూ కబుర్లు.. చేతుల నుంచి నియోజకవర్గాలకు నియోజకవర్గాలు జారి పోతున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటూ కూర్చోవాలి.