హీరాణీ లైంగికంగా వేధించారంటున్న మహిళ
Send us your feedback to audioarticles@vaarta.com
దేశంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన రాజ్‌కుమార్ హీరాణి.. ఓ దర్శకత్వ శాఖకు చెందిన మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. `సంజు` సినిమాలో సహాయక దర్శకత్వ శాఖలో పనిచేసిన మహిళ.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో రాజ్‌కుమార్ హిరాణి తనపై ఆరు నెలలుగా తనని వేధిస్తున్నాడని, ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాత విదు వినోద్ చోప్రాకు, అతని సోదరి, భార్యకు ఆమె మెయిల్ పంపినట్లు హాఫ్ పోస్ట్ పత్రిక పేర్కొంది.
మహిళ రాసిన మెయిల్ ప్రకారం రాజ్ కుమార్ హిరాణి ఆరు నెలలు పాటు వేధించినట్లు వేరే అవకాశం లేక.. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక.. తన పని గురించి బయట తప్పుగా మాట్లాడుతారనే భయంతో ఆమె ఎవరికీ తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పే ధైర్యం చేయలేకపోయిందట. అయితే హిరాణిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. తన పేరుని చెడగొట్టడానికే ఎవరో ఇలా చేయిస్తున్నారని రాజ్‌కుమార్ తరపున లాయర్ అంటున్నారు. అయితే ఓ ప్రముఖ దర్శకుడిపై ఇలాంటి లైంగిక ఆరోపణలు రావడం సంచలనంగా మారింది...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.