close
Choose your channels

అధీర పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది: సంజయ్ దత్

Friday, January 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అధీర పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది: సంజయ్ దత్

హీరో యశ్ బర్త్‌డే సందర్భంగా ‘కేజీఎఫ్ 2’ టీజర్ విడుదలై దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్యంగా హైలైట్ అవుతోంది.. అధీర పాత్ర. అసలు అధీర ఎలా బతికున్నాడు? అనేదానిపై చాలా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశం ప్రస్తుతం సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాలో అధీర పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించారు. ఈ పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో సంజయ్ దత్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అధీర పాత్రను తాను ఎంతగానో ఎంజాయ్ చేస్తూ చేశానని సంజయ్ దత్ వెల్లడించారు.

చాప్టర్ 2లో యాక్షన్ సన్నివేశాల విషయానికి వస్తే.. చాప్టర్ 1కు మించి ఉంటాయని సంజయ్ దత్ వెల్లడించారు. కాగా.. ఇప్పటి వరకూ తాను నటించిన పాత్రలతో పోలిస్తే అధీర పాత్ర చాలా భిన్నమైనదని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు. భయం, దయాదాక్షిణ్యాలు లేని అతి క్రూరమైన పాత్రగా అధీర పాత్రను ఆయన అభివర్ణించారు. ఈ పాత్ర కోసం సిద్ధమవడానికి తాను శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని సంజయ్ దత్ వెల్లడించారు. షూటింగ్ కోసం మేకప్ వేసుకోవడానికే ప్రతి రోజు గంటన్నర సమయం పట్టేదని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.

డైరెక్టర్ ప్రశాంత్ తనకు కథ చెప్పగానే ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని.. వెంటనే ఓకే చెప్పేశానని సంజయ్ దత్ వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. ఈ సినిమాలో అధీకర పాత్ర చాలా బలమైనదని.. గతంలో తాను పోషించిన పాత్రలకు చాలా భిన్నమైనదని అందుకే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశానని సంజయ్‌దత్ వెల్లడించారు. హీరో యశ్ తాను ఈ సినిమాలో పోటాపోటీగా తలపడతామని.. ఆ సన్నివేశాలన్నింటినీ ప్రశాంత్ చాలా అద్భుతంగా తెరకెక్కించాలని సంజయ్ దత్ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.