పవన్ మళ్లీ సినిమాల్లోకే.. ఫ్యూచర్‌పై రైటర్ జోస్యం!!

  • IndiaGlitz, [Monday,May 20 2019]

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్న సందర్భంలో అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతలు అధికారం మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు వైసీపీ వైపే మొగ్గు చూపడంతో ఇక ఆ పార్టీ నేతల మాటలు.. ప్రత్యర్థులపై తూటాల్లా పేలిపోతున్నాయ్.

అంతేకాదు.. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అట్టర్‌ప్లాప్ అయిన ఆంధ్రా ఆక్టోపస్ రాజగోపాల్ సర్వే.. ఏపీలో కూడా డబుల్ అట్టర్ ప్లాప్ అవుతుందని విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు. అయితే ఈ సర్వే వ్యవహారాలపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు స్పందించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే కనుచూపు మేరల్లో వెతికినా.. మైక్రోస్కోప్ పెట్టి వెతికినా జనసేన పార్టీకి ఒక సీటు వస్తుందని సర్వేలు చెబుతున్నాయే తప్ప.. కింగ్ మేకర్, చక్రాలు-బొంగరాలు తిప్పడేం లేదని.. ఇదేం కర్ణాటక కాదని స్పష్టం చేసేశాయి. దీంతో కార్యకర్తలు, మెగాభిమానులు, మెగా బ్రదర్స్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖ రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ గురించి ప్రస్తావిస్తూ.. జనసేనాని ఫ్యూచర్‌ చెప్పేశారు.

నాకు తెలుసు!

పవన్‌ భవిష్యత్ నాకు క్లియర్‌గా తెలుసు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. మేకప్ వేయించుకుంటాడు!. సినిమాలలో యాక్ట్ చేస్తారని.. ప్రొడ్యూసర్ పేరు కూడా త్వరలో వింటారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలుసు.

పవన్ మాతో కథ రాయించుకోడని.. ఆయనకు పెద్ద సక్సెస్ ఇష్టముండదు. ఆయన గురించి వదిలేయడం మంచిది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా జనసేన టీడీపీ కలిసి పోటీ చేశాయి. పరోక్షంగా పొత్తు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన నాకు ఈ ఆసక్తికర విషయం తెలిసింది అని చిన్నికృష్ణ జోస్యం చెప్పారు.

కాగా.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజునుంచే.. ఫలితాల తర్వాత జనసేన సంగతేంటి..? పవన్ పొలిటికల్ ఫ్యూచరేంటి..? పవన్ రాజకీయాలు కొనసాగిస్తారా..? అన్నయ్య చిరు మాదిరిగానే మళ్లీ సినిమాల్లోకెళ్లి మేకప్ వేసుకుంటారా..? అని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హడావుడి.. మీడియాలో కథనాలు ప్రచురించిన విషయం విదితమే. సో.. మే-23 తర్వాత వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతల భవిష్యత్ తేలిపోనుంది.

More News

ఢిల్లీలో బాబును ‘ఫెవికాల్ బాబా’ అంటున్నారట!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తహతహలాడుతున్నారు. అదేదో సామెత ఉందిగా.. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం

ఐశ్వర్యను ఘోరంగా అవమానించిన హీరో!

సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం.. వారిని ఆటపట్టించడం లాంటి చిల్లర పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

మోదీ మేనియాతో దుమ్ములేపిన స్టాక్ మార్కెట్లు

దేశ వ్యాప్తంగా నమో మోదీ నామ స్మరణ గట్టిగా వినిపిస్తోంది. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలు తేల్చడంతో సెన్సెక్స్‌ తారాజువ్వలా ఎగసిపడి అతిభారీ లాభాలతో ముగిసిశాయి.

లగడపాటీ.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. అండర్ గ్రౌండ్‌లో దాక్కో!

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని చిలకజోస్యం చెప్పిన మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్.. అది కాస్త అట్టర్ ప్లాప్ అవ్వడంతో ఆయన అడ్రస్ గల్లతైంది.!

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'కిల్లర్'  ట్రైలర్ విడుదల..!!

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం 'కొలైగార‌న్'. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్