బృందావనమది అందరిది మూవీ తో దర్శకుడిగా మారుతున్న రచయిత శ్రీధర్ సీపాన

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి బృందావనమది అందరిది అనే టైటిల్ ను ఖరారు చేశారు. పూలరంగడు, లౌక్యం, అహనా పెళ్లంట, భీమవరం బుల్లోడు, సర్దార్ గబ్బర్ సింగ్, పవర్, పోటుగాడు, డిక్టేటర్ వంటి చిత్రాలతో రచయితగా తన ప్రతిభను చాటుకున్నారు శ్రీధర్ సీపాన. తన మాటలతో ప్రేక్షకుల్ని బాగా నవ్వించడం ఈ రచయిత ప్రత్యేకత. త్రివిక్రమ్ లా ఓ సన్నివేశంలో కొత్త తరహా హాస్యాన్ని తీసుకొస్తారనే పేరు ఈ రచయితకు ఉంది. ఇక ప్రస్తుతం శ్రీధర్ సీపాన బృందావనమది అందరిదీ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు.

ఈ విషయాన్ని గురించి శ్రీధర్ సీపాన మాట్లాడుతూ...దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది. రచయితగా నన్నెంతో ఆదరించారు. ఆ ఆదరణ, గుర్తింపు ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అవుతున్నాను. తొలి చిత్రంగా బృందావనమది అందరిదీ అనే సినిమాను చేస్తున్నాను. ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటూ మనలోని బంధాలను గుర్తు చేసే కథ. ఫైట్లు, పాటలు ఉండే సాధారణ చిత్రంలా ఉండదు. నాకు రచయిత జంధ్యాల గారంటే అభిమానం. ఆయన అహనా పెళ్లంట సినిమాలా...కుటుంబమంతా హాయిగా నవ్వుకునే సినిమా చేయాలనుకుంటున్నాను. అందుకే కమర్షియల్ కథలు ఉన్నా...అవన్నీ పక్కనబెట్టి ఈ కథను ఎంచుకున్నాను. తొలి సినిమా కాబట్టి...హాస్యం, భావోద్వేగాలు కలిసిన కథ అయితే బాగుంటుందని భావించాను. ఈ చిత్రం ద్వారా నాకొక మార్క్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈ నెల 29న నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా మరిన్ని వివరాలు తెలియనున్నాయి

More News

'వైశాఖం' బి.ఎ.రాజుగారికి, జయగారికి మంచి పేరు తెస్తుంది - కింగ్ నాగార్జున

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం`. ఈ సినిమా జూలై 21న విడుదలవుతుంది.

చెర్రీ దంపతులు పెద్ద మనసు

పరాయి రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా 65 మంది మరణించారు. ప్రజలు కనీస అవసరాలైన తిండి, నీరు లేక ఇబ్బందలు పడుతున్నారు.

రామ్ చరణ్ కొత్త ఆలోచన...

మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగస్థలం 1985` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు.

బాలీవుడ్ టు హాలీవుడ్...

హాలీవుడ్ చిత్రాల్లోని సన్నివేశాలను టెక్నాలజీని మన సినిమావాళ్లు ఫాలో అవుతుంటారు. కానీ తొలిసారి హాలీవుడ్ సంస్థ, బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయనుంది.

ఐదు కోట్ల సాంగ్...

సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సాంగ్ మాత్రం భారీ స్థాయిలో రూపొందనుందట.