రచయితల సంఘం రజతోత్సవ వేడుక టీజర్‌ ఆవిష్కరణ

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

'నాన్నగారు ఓ మాట చెప్పేవారు. లక్ష్మీ ఎదురువస్తే నమస్కరించు. కానీ సరస్వతి ఎక్కడున్నా వెతికి వెతికి నమస్కరించు. అందుకే రచయితల వేడుకకు వచ్చానని'' రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అన్నారు. నవంబర్‌3న రచయితల సంఘం రజతోత్సవ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా కర్టెన్‌ రైజర్‌గా వేడుకకు సంబంధించిన టీజర్‌ను కృష్ణంరాజు ఆవిష్కరించారు. రచయితల సంఘమంటే సరస్వతీ పుత్రుల సంఘమని, అలాంటి సరస్వతీ పుత్రుల సంఘం లక్ష్మీ దేవి కటాక్షం తో అద్భుతమైన స్వత భవనం కట్టుకునేలా అభివృద్ధి చెందాలని రెబల్ స్టార్ కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. శనివారం ఉదయం ఫిలింనగర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో జరిగిన తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ వేడుకల టీజర్ లాంచింగ్ కోసం జరిగిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శనివారంనాడు నిర్మాతలమండలి హాల్లో జరిగిన

కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రచయితలకు కాన్‌సన్‌ట్రేషన్‌, అంకితభావం వుండాలి. అలా ఎంతోమంది పెద్దలున్నారు. ప్రస్తుతం కాలంతోపాటు రచనల్లో మార్పు వచ్చింది. దానికి అనుగుణంగానే రచయితలు వుంటారు. పిల్లలకు మనం చెబితే దాన్నే ఆచరిస్తారు. అదేవిధంగా రచయితలు రాసిన మాటలే ప్రేక్షకుల్లో పాపులర్‌ అవుతాయి. మంచి మార్గంలో దోహదపడేలా వుండాలి. నేను చాలా పెద్ద పెద్ద మహానుభావులతో పని చేశాను. ఆత్రేయగారు ఏదన్నా సీన్‌ రాసే ముందు ఆయన ఆ క్యారెక్ట్‌లోకి వెళ్లిపోయి డైలాగ్‌లు రాస్తారు. అందరూ రాస్తారు కాని నువ్వు రాసిందికాదు ఉచ్చరించేది అనేవాడ్ని. రచయితలు మహానుభావులు వంటివారని పేర్కొన్నారు.తానూ రచయితల సంఘం సభ్యుడినేని, తనతండ్రి సరస్వతీ దేవి కోసం మనమే వెతుక్కుంటూ వెళ్లాలని చెప్పేవారని అన్నారు. కార్యక్రమం బలభద్రపాత్రుని రమణి స్వాగతంతో ప్రారంభమైంది. ప్రధాన కార్యదర్శి ఆకెళ్ల, పరుచూరి వెంకటేశ్వరరావు సంఘం తొలినాటి విశేషాలను వివరించారు. అధ్యక్షుడు డా. పరుచూరి గోపాలకృష్ణ సంఘం కార్యకలాపాలు, నవంబరు మూడున ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరగబోతున్న రచయితల సంఘం రజతోత్సవ విశేషాలని వివరించారు. అగ్ర రచయితలు దశాబ్దాల వారీగా తెలుగు సినిమా రచనల గూర్చి రచయితల గొప్పదనం గూర్చి ప్రసంగించారు.

ముందుగా పలువురు అగ్ర రచయితలు పాల్గొని 1932 దశకం నుంచి ఈ దశకం వరకు తెలుగు చిత్రసీమ అభివృద్ధి కోసం సినీ రచయితల కృషిని గుర్తుచేసుకున్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పుట్టుపూర్వోత్తరాలను వివరించారు. 1931 సెప్టెంబర్‌ 15, 1932 ఫిబ్రవరి 6న భక్త ప్రహ్లాదతో మొదలైందన్నారు. 1936లో ఒకేసారి ఏడుగురు రచయితలు ప్రవేశించారన్నారు 'ప్రేమవిజయం' తొలిసాంఘిక చిత్రమన్నారు. 1936లో నాగేశ్వరరావు,1937లో సినిమా ఇండస్ట్రీకి పరిచయమై 1980 వరకు 50కి పైచిలుకు సినిమాలు రచించారన్నారు. కులాంతర వివాహమైన 'మాలపిల్ల' చాలా పెద్ద హిట్‌ అయింది. 'రైతు బిడ్డ' అందరం గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రం. అదేవిధంగా ఆ రోజుల్లో పద్యానికి దగ్గరగా పాట కూడా ఉండేదని తెలిపారు.

ఎస్‌.వి.రామారావు మాట్లాడుతూ... సముద్రాల రాఘవాచారి నుంచి చక్రపాణి వరకు సాగిన చరిత్రను గుర్తు చేశారు. నాగబాలసురేష్‌ మాట్లాడుతూ... 1951 నుంచి 60 వరకు జరిగిన సినిమాల గురించి వాటిలో రచయితలు, దర్శకుల గురించి వివరించారు. పాతాళభైరవి, మిస్సమ్మ, ప్రపంచస్థాయిలో అవార్డులు అందుకున్న దశాబ్ధం ఇదే. గ్రాంధిక భాషలో అలవాటై నిత్యకృతి షావుకారు అనే చిత్రం వాడుక భాషలో తీసి నానుడికి శ్రీకారం చుట్టిన చిత్రమని పేర్కొన్నారు.

వడ్డేపల్లి కృష్ణమూర్తి మాట్లాడుతూ...1961-70 కాలంనాటి చరిత్రను తెలియజేశారు. సినారె లాంటి గొప్ప గొప్ప కవులను కూడా ఈ దశాబ్ధమేనని తెలిపారు. చిలుకుమార్‌ నట్‌రాజ్‌ మాట్లాడుతూ... 1971-80 క్రమాన్ని వివరించారు. ఈ దశాబ్ధంలో స్క్రీన్‌ప్లేలో చాలా మార్పులు వచ్చాయి. పాతరం, కొత్తరం రచయితలు కలిసి ముందుకు వెళ్ళిన దశాబ్ధం ఇదేనని పేర్కొన్నారు. పరుచూరి బ్రదర్స్‌ లాంటివారు ఈ దశాబ్ధాన్ని మొదలై ఇండస్ట్రీని శాసించారని తెలిపారు.

ఉమర్జీ అనూరాధ మాట్లాడుతూ...1981-90వరకు రచయితలు, దర్శకులు నిర్మాత గురించి తెలియజేశారు. టి. కృష్ణ, ఆర్‌.నారాయణమూర్తి వంటివారి చిత్రాలతోపాటు పలు చిత్రాలను విశ్లేషించారు. ఇంకా రత్నబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.

More News

అభిమానికి సూపర్ స్టార్ స్వీట్‌ వార్నింగ్‌

రజనీకాంత్‌ ఓ అభిమానికి సుతిమెత్తటి వార్నింగ్‌ను ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే..

'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' బావుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు! - సాయికిరణ్ అడివి

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా నటించిన సినిమా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'

'కంత్రీరాజా' నవంబర్ రెండో వారంలో విడుదల

నవతరం రీల్స్ పతాకం పై తనీష్ హీరోగా నాగేష్ నారదాసి దర్శకత్వంలో మధు బాబు వెల్లూర్ నిర్మాతగా, నిర్మాణంలో వున్నా చిత్రం "కంత్రీరాజా".

'ఊల్లాల  ఊల్లాల' అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ

తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా "ఊల్లాల  ఊల్లాల" చిత్రం లో నటించింది

'ప్రేమ పిపాసి' టీజ‌ర్ లాంచ్‌

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకం పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి`