'యమన్' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,February 22 2017]

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌'. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్‌రిలీజ్ అవుతుంది.

ఈ సంద‌ర్భంగా...

నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో డిఫ‌రెంట్ మూవీ 'యమన్‌'. ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీలా 'యమన్‌' వుంటుంది. ఇప్పటివరకు విజయ్‌ ఆంటోని అంటే బిచ్చగాడు హీరోగానే అందరూ గుర్తించారు. ఈ సినిమా తర్వాత 'యమన్‌' హీరో అని కూడా పిలుస్తారు. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం. గత సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే ఈ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర‌వ‌రి 24న‌ రిలీజ్‌ చేస్తున్నాం. క‌చ్ఛితంగా ఈ సినిమా బిచ్చగాడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది'' అన్నారు.

విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌.

More News

సూపర్ స్టార్ చేతుల మీదుగా లారెన్స్ తల్లి విగ్రహవిష్కరణ....

కొరియోగ్రాఫర్,యాక్టర్,డైరెక్టర్ అయిన రాఘవేంద్ర లారెన్స్,కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పేద పిల్లలకు సహాయం

పూరి జగన్నాథ్ 'రోగ్' హీరో ఇషాన్ ఫస్ట్ లుక్ విడుదల

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ).

'యమన్' చిత్రం సక్సెస్ అయి తెలుగులో నాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెస్తుంది - మియాజార్జ్

అందం, అభినయం ఉన్న నటి మియాజార్జ్. మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్గా నటించి అనతి కాలంలోనే మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం సునీల్ సరసన 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.

ఫిబ్రవరి 24న నాని, డి.వి.వి.దానయ్య చిత్రం ఫస్ట్ లుక్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

సూర్యతో కూడా రెడీ అయ్యింది...

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ నెమ్మదిగా తమిళ సినిమా రంగం వైపు దృష్టి సారిస్తుంది.