close
Choose your channels

పిల్లల సమక్షంలో పుట్టినరోజు జరుపుకున్న హీరోయిన్ యామిని భాస్కర్

Tuesday, September 20, 2016 • తెలుగు Comments

తెలుగులో కీచక, టైటానిక్ చిత్రాలతో పాటు తమిళంలో మున్నోడి వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ యామినీ భాస్కర్.  సెప్టెంబ‌ర్ 20న యామినీ భాస్క‌ర్ పుట్టిన‌రోజు. త‌న పుట్టిన‌రోజునును బంధు మిత్రుల‌తో కాకుండా పిల్ల‌ల‌తో జ‌రుపుకోవాల‌ని భావించిన యామినీ భాస్క‌ర్‌  సంగారెడ్డిలోని ఓ గ‌ర్ల్స్ స్కూల్‌లో పిల్ల‌ల‌తో కలిసి త‌న పుట్టిరోజు వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంది. అంతే కాకుండా...అక్క‌డి స్కూల్‌లో మెరుగైన త్రాగు నీటిని అందించ‌డానికి వాట‌ర్ ప్యూరిఫయ్య‌ర్‌ను కూడా అందించింది.
 
ఈ సంద‌ర్భంగా యామినీ భాస్క‌ర్ మాట్లాడుతూ... ఈ ఏడాది ఇలా పిల్ల‌ల‌తో క‌లిసి పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది.త్వ‌ర‌లో ఓ స్టార్ హీరో మూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్నాను. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను అని తెలిపారు.