close
Choose your channels

బాబు దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ‘మల్లెపూల ఆంటీ’!

Monday, February 11, 2019 • తెలుగు Comments

బాబు దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ‘మల్లెపూల ఆంటీ’!

ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ధర్మపోరాట దీక్ష’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులు, పలువురు కీలక నేతలు బాబు పోరాటానికి మద్దతు పలికారు. ముఖ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, శరద్ యాదవ్‌‌తో పాటు పలువురు ప్రముఖులు దీక్షాస్థలికి వచ్చి టీడీపీ అధినేతకు మద్దతు పలికి.. అనంతరం కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

అయితే ఇంతలా ఆ ప్రముఖులు మాట్లాడినప్పటికీ వీరెవరికీ నెటిజన్లు ఓట్లు వేయలేదు. సభ మొత్తానికి టీడీపీ మహిళా నేత యామిని సాధినేని.. నెటిజన్లు ముద్దుగా పిలుచుకునే ‘మల్లెపూల ఆంటీ’ హైలైట్‌‌గా నిలిచారు. భరతమాత గెటప్ వేసిన యామిని అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ‘నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం’ అనే ప్లక్కార్డులు పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లడం.. ఆయనతో కలిసి ఫొటో దిగడం అనంతరం మీడియా ముందుకు వచ్చి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం.. ఆమె మాట్లాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే బాబు దీక్షలో మల్లెపూల ఆంటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు!

కాగా.. ఈమె గెటప్‌‌పై తెలుగు తమ్ముళ్లు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు పలువురు నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అసలు మీకు భరతమాత అంటే ఎవరో తెలుసా..? మీకు ఏ అర్హత ఉందని ఈ గెటప్ వేశారు..? మీ గురించి చాలా విన్నాం.. డిబెట్లలో చూశాం మీరు మీ మాటలు..? భరత మాతకు ఉన్న పరువును తీస్తున్నారు..? మీలాంటి వాళ్లు అంటూ పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇంకొందరైతే అప్పట్లో ఎంపీ శివప్రసాద్.. ఇప్పట్లో యామిని సాధినేని ఇద్దరి వల్ల ఏం ప్రయోజనం లేదంటూ విమర్శనాస్త్రాలు విసిరారు. సో ఏది ఏమైనప్పటికీ ఏపీ కోసం చేస్తున్న పోరాటంలో యామిని సాధినేని తన వంతుగా నిరసన తెలుపుతూ కేంద్రం తీరును తప్పు బట్టిన ఆమెను మెచ్చుకోక తప్పదు.