యార్ల‌గ‌డ్డ సుమంత్ సినిమా పూర్త‌య్యింది..

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

ప్రేమ‌క‌థ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి న‌టుడు అనిపించుకున్నాడు అక్కినేని మ‌న‌వ‌డు..నాగార్జున మేన‌ల్లుడు యార్ల‌గ‌డ్డ సుమంత్. ఆత‌ర్వాత స‌త్యం, గౌరి, మ‌ధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ సాధించాడు. కానీ...అందం - అభిన‌యం రెండూ ఉన్నా, అక్కినేని కుటుంబం అండగా ఉన్నా..అభిమాన‌గ‌ణం ఉన్నా...సుమంత్ కి కాలం క‌ల‌సి రాలేదు.

ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు సినిమా త‌ర్వాత న‌ట‌కు కాస్త గ్యాప్ ఇచ్చిన సుమంత్ తాజాగా బాలీవుడ్ లో విజ‌యం సాధించిన విక్కీ డోన‌ర్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్నారు. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటుది. ఈ సినిమా గురించి సుమంత్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...వండ‌ర్ ఫుల్ క్రూ ఆఫ్ మై ప్ర‌జెంట్ ఫిలిమ్ అంటూ త‌న సినిమా టీమ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. దాదాపు షూటింగ్ పూర్త‌య్యింద‌ని తెలియ‌చేసారు. మ‌రి..రెండు సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సుమంత్ ఈసారైనా స‌రైన స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ లో స‌ల్మాన్..

అడ‌వి శేషు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన చిత్రం క్ష‌ణం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి నిర్మించిన క్ష‌ణం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

సూపర్ స్టార్ సూర్య 'మేము' విడుదల వాయిదా!

సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన 'పసంగ-2' తెలుగులో 'మేము'

బ్ర‌హ్మోత్స‌వం లేటెస్ట్ న్యూస్...

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న బ్ర‌హ్మోత్స‌వం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు.

స‌ర్ధార్ సెట్ లో క‌మెడియ‌న్ పై ప‌వ‌న్ ఆగ్ర‌హం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ సెట్ లో ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్. బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌...ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌.

ఊపిరి - 2 లో నాగ్ సార్ తో డాన్స్ చేస్తా - తమన్నా...

నాగార్జున -కార్తీ -తమన్నా కాంబినేషన్లో రూపొందిన భారీ మల్టీస్టారర్ ఊపిరి.వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.