ఆగష్టులో జీవీ ప్రకాష్ - యశ్వంత్ మూవీస్ 'బ్రూస్ లీ'

  • IndiaGlitz, [Thursday,July 13 2017]

మ్యూజిక్ డైరెక్ట‌ర్ కం హీరో జీవీ ప్ర‌కాష్‌కుమార్‌ న‌టించిన త‌మిళ చిత్రం 'బ్రూస్‌లీ' తెలుగులో అదే పేరుతో రిలీజ్ కానుంది. ఆ మేర‌కు ఈ సినిమా అనువాద కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయని నిర్మాత తెలిపారు. య‌శ్వంత్ మూవీస్ ప‌తాకంపై డి.వెంక‌టేష్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించనున్నారు. ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత వెంక‌టేష్ మాట్లాడుతూ - ''జీవీ ప్ర‌కాష్ న‌టించిన ప‌లు చిత్రాలు తెలుగులో ఇప్ప‌టికే రిలీజై చ‌క్క‌ని విజయం సాధించాయి. త‌మిళంలో జీవీ ప్ర‌కాష్ హీరోగా తెర‌కెక్కి, ఘ‌న‌విజ‌యం సాధించిన 'బ్రూస్‌లీ' చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాం. అనువాద కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. ఆగ‌ష్టులో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం'' అని తెలిపారు. ప్ర‌శాంత్ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి జీ.వీ.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందించారు. కెమెరా: పి.వి.శంక‌ర్‌, ఎడిటింగ్: ప‌్ర‌దీప్‌.ఇ.రాఘ‌వ్‌.

More News

విడుదలైన ఏంజెల్ తమిళ వెర్షన్ ఆడియో

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్,హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా దర్శకుడు ఆడియో వేడుక

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్సీఎస్పీ విజయ్కుమార్, థామస్రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

జూలై 14 న ప్రపంచ వ్యాప్తంగా 'డా చక్రవర్తి' విడుదల

శ్రీ వేంకటేశ్వర సూపర్ మూవీస్ బ్యానర్పై 'ఎ ఫిల్మ్ బై అరవింద్' వంటి సెన్సేషనల్ చిత్రాన్ని రూపొందించిన శేఖర్ సూరి దర్శకత్వంలో ఎ. వెంకటేష్ (ఛాంప్), శేఖర్ సూరి, బి. ఆర్. రత్నమాల రెడ్డి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'డా||చక్రవర్తి'.

బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో తెరకెక్కే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న తెలుగు సినిమా హీరో శ్రీ రాజ్

భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు.

శంకరమహదేవన్ 'విమెన్ యాంథెమ్ సాంగ్' మహిళల కోసం జాతీయ గీతం...!

మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేది అమ్మ.మహిళ వల్లనే జీవితం.