నగరిలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అవమానం...

  • IndiaGlitz, [Monday,January 06 2020]

టైటిల్ చూడగానే ఇదేంటి.. రోజా వైసీపీ ఎమ్మెల్యేనే కదా..? మళ్లీ వైసీపీ కార్యకర్తలు షాకివ్వడమేంటి..? అసలేంటి ఈ అవమానం..? ఏం జరిగింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏపీఐసీసీ చైర్ పర్సన్ రోజాకు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకెళితే.. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వెళ్లిన రోజాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోజా గో బ్యాక్.. రోజా డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఒకానొక సందర్భంలో ఆమె కారుపై దాడికి కూడా యత్నించడం గమనార్హం. అసలు శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశంలోపలికి కూడా రానివ్వకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కలగజేసుకుని వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమనిగినిగింది.

కారణమేంటి..?

వైసీపీ నాయకులను వదిలిపెట్టి టీడీపీ వారికి రోజా ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపనకు వెళ్లిన రోజాను నిలదీశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనీసం తమను పట్టించుకోలేదని స్థానిక నేతలు.. మరోవైపు తమను కూడా లెక్క చేయట్లేదని కార్యకర్తలను కూడా కన్నెర్రజేస్తున్నారు. ఈ వ్యవహారం జరిగిన అనంతరం ఎక్కువ సేపు ఉండగా కేవలం 15 నిమిషాల్లోనే కార్యక్రమాన్ని ముగించుకుని రోజా వెనుదిరిగారు. మొత్తానికి చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలల్లోనే రోజాపై ఇంత వ్యతిరేకత వస్తోందంటో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. రానున్న 2024 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదేమో మరి.