close
Choose your channels

సెంటర్ ఏదైనా ఓకే.. దమ్ముంటే రా.. టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెంటర్ ఏదైనా ఓకే.. దమ్ముంటే రా.. టీడీపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కొందరు టీడీపీ నేతలు మీడియా ముందుకు రావడానికి కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటే.. ఇంకొందరు మాత్రం ఏమేం టాపిక్ దొరుకుతుందా మీడియా మీట్ పెడదామా అని వేచిచూస్తున్నారు. ఇక కడప జిల్లా జమ్మలమడుగు విషయానికొస్తే.. ఇక్కడ్నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టీడీపీ నేత రామసుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది.. అది కాస్త సవాళ్ల దాకా వెళ్లింది.

ఊహించని రీతిలో..!

2019 ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి టీడీపీ తరఫున రామసుబ్బారెడ్డి, వైసీపీ తరఫున సుధీర్ రెడ్డి పోటీచేశారు. అందరూ ఇక్కడ వైసీపీ డౌటేనని.. బద్ధశత్రువులైన రామసుబ్బారెడ్డి-మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చేతులు కలపడంతో కచ్చితంగా ఇక్కడ పసుపు జెండానే ఎగురుతుందని అందరూ భావించారు. అయితే మే-23న సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.. కనివినీ ఎరుగని రీతిలో సుధీర్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలుపొందారు. అంతేకాదు మరోవైపు కడప పార్లమెంట్ స్థానానికి పోటీచేసిన ఆది సైతం ఘోరంగా ఓడిపోయారు.

ఇలా వచ్చి అలా విమర్శలా!

అయితే.. జమ్మల మడుగులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంఎస్సార్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లు చేపడుతున్నారని రామసుబ్బారెడ్డి ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు. ఈ సంచలన ఆరోపణలకు సుధీర్ రెడ్డి ఎట్టకేలకు మీడియా ముందుకు కొచ్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "టీడీపీ నేత సుబ్బారెడ్డి వారానికి ఓరోజు జమ్మలమడుగుకు వస్తారు. అలా వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి పోతారు. ఆయన మాటలను కూడా ‘ఆంధ్రజ్యోతి’ అనే ఒక పత్రిక తప్ప వేరే పేపర్లేవీ ప్రచురించవు. నేను ఎమ్మెల్యే అయి నెల రోజులు అయింది. ఇంకా కాళ్ల నొప్పులు తగ్గలేదు. టీడీపీ ఓడిపోవడంతో కలెక్షన్ వెళ్లిపోయిందని రామసుబ్బారెడ్డి బాధపడుతున్నారు.

బస్తేమే సవాల్.. ఎక్కడైనా సరే..!

"మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ స్థానికంగా చేపట్టిన సోలార్ ప్రాజెక్టును ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుమారులు దోచుకుతిన్నారు. ఓ కూలీకి రోజుకు రూ.500 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.300 ఇచ్చి మిగతాది లాగేసుకున్నారు. అవినీతికి పాల్పడ్డారన్న విషయంలో జమ్మలమడుగులో ఏ సెంటర్‌లో అయినా చర్చకు సిద్దం.. దమ్ముంటే రావాలని సుబ్బారెడ్డి సవాల్ స్వీకరించి ముందుకు రావాలి. సుబ్బారెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో, ఎవరి దగ్గర ఎంత ముడుపులు పుచ్చుకున్నారో నాకు తెలుసు. నారప్పస్వామి దేవాలయం ముందు ప్రమాణం చేద్దాం" అని సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు.

అయితే సుధీర్ రెడ్డి విసిరిన ఈ సవాల్‌కు సుబ్బారెడ్డి మాత్రం ఇంత వరకూ రియాక్ట్ అవ్వలేదు. కాగా.. మంత్రి పదవి దక్కించుకున్న అనంతరం ఆది ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పావలా శాతం సుబ్బారెడ్డికి ఇవ్వమని చంద్రబాబే చెప్పారన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.. అప్పట్లో ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఇప్పుడు మరొసారి ఇలాంటి టాపిక్ రావడంతో మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సో.. జమ్మలమడుగులో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో.. ఎక్కడు ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.