‘పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్న పవన్‌పై ఆయన కౌంటర్ ఎటాక్ చేశారు. రెండు చోట్ల ఓడిపోయాననే సిగ్గులేకుండా.. ఎందుకు ఓడిపోయాననే విశ్లేషణ చేసుకోకుండా నూతన ప్రభుత్వంపై మాటలదాడిని పవన్‌కల్యాణ్‌ చేతగానితనం, సినిమా వేషాలకు పరాకాష్టగా భావిస్తున్నామన్నారు. అసలు పుత్రుడు లోకేష్‌ పనికి రాడని చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను దత్తపుత్రుడిగా తెచ్చుకున్నారన్నారు. పవన్‌కు ఉన్న సినిమా క్రేజ్‌ను అడ్డును పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడన్నారు.

విన్యాసాలు చూసి నవ్వుకుంటున్నారు..!

‘పవన్‌ కల్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కవ.. ఎమ్మెల్యేకి తక్కువ. ఈ రోజు వరకు చట్టసభల్లోకి ప్రవేశించింది లేదు కానీ మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో వచ్చే కట్టుకథలను ఆధారంగా చేసుకొని పవన్‌ చేసే విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇసుక కొరతకు కారణాలను విశ్లేషించుకోవడంలో పవన్, చంద్రబాబు విఫలమయ్యారు. గత ప్రభుత్వం ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేసింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఇసుక రూపంలో దోపిడీ దొంగల్లా టీడీపీ నేతలు, స్వయాన చంద్రబాబు కొడుకు దోచేసుకున్నారు. అలాంటి పరిస్థితిని రూపుమాపి పేదలకు కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నూతన పాలసీ తీసుకువచ్చారు. అది అమలు చేస్తున్న క్రమంలో వరదలు వచ్చాయి. ఎక్కడా ఇసుక తీయడానికి అవకాశం లేకపోవడంతో ఇసుక కొరత కొంత ఏర్పడింది. ఇసుకపై చంద్రబాబు, పవన్‌ వైఖరి, రాజకీయ విన్యాసాలు చాలా అవమానకరంగా ఉన్నాయి’ అని ఆయన చెప్పుకొచ్చారు.

తెలుసుకుని మాట్లాడు పవన్!

‘2008లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కచోట ఎన్నికల్లో దాఖలాలు లేవు. నిజంగా చట్టాలు తెలిసి ఉంటే పవన్‌ ఇలా మాట్లాడి ఉండేవారు కాదు. పచ్చపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పవన్‌ మాట్లాడడం సిగ్గుచేటని, పవన్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. స్థాయి తెలుసుకొని పవన్‌ మాట్లాడితే మంచిది. పవన్‌ కల్యాణ్‌ సినిమా ప్రయాణం చిరంజీవి తమ్ముడిగా మొదలైందని, రాజకీయాల్లోకి చిరంజీవి తమ్ముడిగానే వచ్చారు. కానీ ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో సంబంధం లేకుండా.. చంద్రబాబు తొత్తులు, కార్పొరేట్‌ సెక్టార్‌ తొత్తులతో జతకట్టారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు సొంతంగా తీసుకున్న నిర్ణయమా.. లేక చంద్రబాబు నిర్ణయించారా.. సూటిగా అడుగుతున్నాం. పవన్‌ నటన ఇప్పటికైనా ఆపేయాలని, బాబు డైరెక్షన్‌లో నటన చూసి రోడ్డు మీద వెళ్లే వారు కూడా నవ్వుకుంటున్నారు’ అని సుధాకర్ బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.

More News

'నిశ్శ‌బ్దం' టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్‌

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

ఇంకా విధుల్లో చేరని ‘ఎల్వీ’.. అసలేం జరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయిన సంగతి తెలిసిందే.

జగన్ కీలక నిర్ణయం.. ‘తెలుగు’కు కాలం చెల్లిపోయింది!?

అవును మీరు వింటున్నది నిజమే.. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగు’కు కాలం చెల్లిపోనుంది.

తహసీల్దార్ హత్యకేసు: నిందితుడి భార్య ఏమందంటే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి కేసు వ్యవహారంపై రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తోంది.

‘యాక్షన్‌' చిత్రంలోని ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా... పాటకు గుడ్‌ రెస్పాన్స్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌'.